గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 15, 2020 , 01:59:09

వరాహమా..గెలువుమా!

వరాహమా..గెలువుమా!

అయిజ : పందులు తలపడిన పోటీలు పలువురిని ఆకట్టుకున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలో జరుగుతున్న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మార్కెట్‌ సబ్‌ యార్డు ఆవరణలో పందులు తలపడే పోటీలను ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలలో పాల్గొనేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి 10 జతల పందులను పోటీలకు తరలించారు. ఉదయం 6 గంటలకే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అయిజ, పెబ్బేర్‌, కర్నూల్‌, అనంతపురం, కడప, రాయచోటి, కోడుమూరు, తాడిపత్రి, రాయచూర్‌, రాయదుర్గం తదితర ప్రాంతాల నుంచి పందులను పోటీకి తరలించారు. పోటీలలో పందులను ఒకదానికొకటి తలపడి పారిపోయే వరకు పోరాడుతాయి. ఎన్ని నిమిషాలు ఎక్కువగా పందులు తలపడుతాయో వాటిని నిర్వాహకులు విజేతలుగా ప్రకటించారు. మొదటి బహుమతి అయిజకు చెందిన వైఎం శివ పంది కైవసం చేసుకోగా, రెండో బహుమతి అయిజ చెందిన అంజి పంది, మూడో బహుమతి తాడిపత్రికి చెందిన గంగన్న పంది కౌవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన పందుల యజమానులకు నగదు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ. 50,016, రెండో బహుమతి రూ. 20.016, మూడో బహుమతి 10.016లను అందజేశారు. logo
>>>>>>