సోమవారం 30 మార్చి 2020
Gadwal - Feb 15, 2020 , 01:52:55

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

గట్టు : సహకార ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గట్టు పీఏసీఎస్‌కు సంబంధించి 13 వార్డులు ఉన్నాయి. 8,495 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నది. మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్‌ను చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక జెడ్పీ హైస్కూ ల్‌, ప్రాథమిక పాఠశాల (బాలుర)ను పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డుకు ఒక్కో గదిని ఏర్పాటు చేశారు. ఏ వార్డుకు సంబం ధించిన ఓటర్లు ఆ వార్డు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించాల్సి ఉంటుంది. 65 మంది అధికారులు పోలింగ్‌ నిర్వహణను చూడనున్నారు. ఆర్‌వో (రిటర్నింగ్‌ అధికారి), ఏఆర్‌వో (అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి)తో పాటు ఒక్కో వార్డు పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవోతోపాటు ముగ్గురేసి వోపీవోలు పోలింగ్‌ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. శుక్రవారం మధ్యా హ్నమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌ అధికారులు తమకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


logo