ముగిసిన ప్రచారం

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో సహకార సంఘం ఎన్నికల ప్రచారం ముగిసింది. బరిలో 261 మంది అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో పర్యటించి ఓటర్లను ప్రస న్నం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఇ తర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను పో లింగ్ రోజు తిరిగి గ్రామాలను తీసుకువ చ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక ఈ రో జు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారు లు పోలింగ్ సామగ్రిని అందించనున్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి విభాగానికి ఒక ఉన్నతాధికారిని నియమించారు. వీరి ద్వారా పో లింగ్‌కు కావల్సిన అన్ని ఏర్పాట్లను చేపట్టనున్నారు.
జోరుగా ప్రచారం
విత్‌డ్రా ప్రక్రియ ముగిసిన నాటి నుంచి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగాయి. సహకార ఎన్నికల ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రతి ఒక్క ఓటర్లను తమకు ఓటు వేయమని వేడుకున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్లారు. ప్రతిపక్ష అభ్యర్థులకు అందనంత వేగంగా గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యనాయకులు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేశారు. తమతమ పరిధిలోని ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తులు చేశారు.
పోలింగ్ ఏర్పాట్లు
చేపట్టిన అధికారులు
రేపే పోలింగ్ నిర్వహణ ఉండటంతో ఎ న్నికల అధికారులు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేపట్టారు. బ్యాలెట్ బాక్స్ రూపంలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కావల్సిన బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మొత్తం 9విభాగాలకు 9 మంది ఉన్నతాధికారులను నియమించారు. వీరిలో డీపీవో కృష్ణను బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెం ట్ అధికారిగా, సీపీవో వెంకటరమణ, ఇన్చార్జి డీఈవో సుశ్రీందర్ రావును మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అధికారులుగా, వెటర్నరీ అధికారి సాయి ఆదిత్యకేశవ్ను ట్రైనింగ్ మేనేజ్మెంట్ అధికారిగా, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయశాఖ అధికారి గోవింద్ నాయక్‌ను మెటీరియల్ డిస్ట్రీబ్యూషన్ అధికారులుగా, డీఎం అండ్ ఎస్వో జయరాజును మెటీరియల్ మేనేజ్మెంట్ అధికారిగా, డీఎఫ్‌వో రూపేందర్ సింగ్, బీసీ వెల్ఫేర్ అధికారిణి ఇందిరాను బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, బ్యాలెట్ పేపర్ల ట్రైనింగ్ అధికారులుగా, డీటీవో పురుషోత్తమ్ రెడ్డిని ట్రాన్స్ పోర్ట్ అధికారిగా, డీపీఆర్వో సీతారామ్ నాయక్‌ను మీడియా మేనేజ్మెంట్ అధికారిగా, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని నోడల్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్‌గా నియమించారు.
11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలోని 11 సహకార సంఘం పరిధి లో మొత్తం 103 వార్డులకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒ క్కో పోలింగ్ కేంద్రంలో మొత్తం 13 పో లింగ్ రూంలను ఏర్పాటు చేసి వార్డుల వారీ గా ఏర్పాటు చేశారు. గద్వాలలో లింగంబావి దగ్గరి ప్రభుత్వ బాలుర పాఠశాల, గట్టులో జిల్లా పరిషత్ పాఠశాల, ధరూర్‌లో జిల్లా పరిషత్ పాఠశాల, మల్దకల్లో జిల్లా పరిషత్ పాఠశాల, అయిజలో శ్రీ కృష్ణవేణి హైస్కూల్, అలంపూర్‌లో జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, క్యాతూర్‌లో జిల్లా పరిషత్ పాఠశాల, మానవపాడులో జిల్లా పరిషత్ పాఠశాల, కలుగొట్లలో అప్పర్ ప్రైమరీ స్కూల్, వడ్డేపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాల, పుటాన్దొడ్డికి ఇటిక్యాలలోని పాఠశాలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!