గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 14, 2020 , 00:32:21

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్‌

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్‌

గద్వాల, నమస్తేతెలంగాణ :  ఈనెల 15వ తేదీ జరిగే సహకార ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో పోలింగ్‌ నిర్వహణ అధికారులు, పోలీస్‌శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క లెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప టి వరకు అన్ని ఎన్నికలు ప్రశాంతం గా  సజావుగా నిర్వహించడం జరిగిందని, సహకార సంఘాల ఎన్నికల ను సైతం ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలీసులను నియమించాలని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. బ్యాలె ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ నుంచి విజేతలను ప్రకటించేవరకు పోలీసుల సహకారం చాలా ఉంటుందన్నారు. పోలిం గ్‌ సిబ్బందికి ఎస్కార్ట్‌ వాహనాలు పెట్టాలన్నారు. లెక్కింపు సమయంలో ఏదేని సమస్య ఉత్పన్నమైతే వెంటనే సంబంధిత పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక కానిస్టేబుల్‌ను కేటాయించడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రానికి ఒక ఎస్సైతో పాటు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు. ఒకేభవన సముదాయంలో 13 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు ప్రణాళిక బద్ధంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, డీసీవో ప్రసాద్‌రావు, రిటర్నింగ్‌ అధికారులున్నారు.

14,15వ తేదీల్లో సెలవు

సహకార ఎన్నికలు ఉన్నందున ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో  స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను పాఠశాలల్లోనే ఏర్పాటు చేయడంతో ఎన్నికలకు అంతరాయం లేకుండా 14, 15వ తేదీలు ఆయా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కేవలం పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు మినహా మి గతా పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు. ఈ విషయాన్ని గమనించాలని ఆమె సూచించారు.


logo