సోమవారం 01 మార్చి 2021
Gadwal - Feb 13, 2020 , 00:19:29

11రోజులు 15కోట్లు

11రోజులు 15కోట్లు

వనపర్తి, నమస్తే తెలంగాణ : 2019-20 ఆర్థిక సం వత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలు చేయడంలో మున్సిపల్‌ అధికారులు ప్రజలపై కొరడా ఝలిపిస్తున్నా రు. మున్సిపాలిటీ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల మా ర్చి 31లోగా ఆస్తిపన్ను పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపాలిటీ ఉన్న లక్ష్యానికి అనుగుణంగా సంబంధిత అధికారులు పన్ను వసూళ్లపై సమయాన్ని కేటాయిస్తున్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని నివాసగృహాలు, దుకాణ సముదాయాల యజమానులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ అధికారులు ప్రచారం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిల వసూళ్లను రాబడుతున్నారు. ఫిబ్రవరి నెల చివరిరోజు వరకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నును చెల్లించిన యెడల మార్చి నెలలో పన్నులు చెల్లించినట్లయితే ఉన్న పన్నుకు అదనంగా 2శాతం పెరుగుతుందని సంబంధిత అధికారులు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నారు. సకాలంలో పన్ను చెల్లించా లని మున్సిపల్‌ అధికారులు కోరుతున్నారు.

ఆరు బృందాలుగా వసూళ్లు

మున్సిపాలిటీ పరిధిలో నివాస గృహాలు, దుకాణ సముదాయాలు మొత్తం కలిపి 12,417 ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను ద్వారా వసూలు చేయాల్సినది రూ.5కోట్ల 14 లక్షలు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్‌ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కో టీంలో ఒక టీంలీడర్‌, ఒక బిల్‌ కలెక్టర్‌, ఒక అసిస్టెంట్‌తో కలిపి ఒక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందానికి పట్టణంలో కేటాయించిన ఆయా వార్డులలోని గడపగడపకు, దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు.

రూ.15లక్షలు వసూలు

2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు మున్సిపాలిటీ ఆర్థిక సంవత్సరంగా పరిగణలోకి తీసుకుని ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 11వరకు రూ.2.50కోట్లు  వసూలు చేశారు. పన్ను వసూలుకు అధికారులు ఫిబ్రవరి 1 నుంచి 11వ తేదీ వరకు రూ.5.14లక్షలు వసూలు చేశారు. 

బహిరంగ ప్రకటనలు 

పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను సకాలంలో చెల్లించాలంటూ పట్టణంలోని ప్రతి వార్డుకు తిరగడానికి మున్సిపల్‌ అధికారులు ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్‌, ఒక ట్రాలీ ఆటోను ఏర్పాటు చేసి బహిరంగ ప్రకటనలను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ వాహనాల ద్వారా పట్టణంలో అన్ని వార్డులు తిరుగుతూ ఆస్తిపన్నుపై అవగాహన కల్పిస్తూ వసూలు చేయడం కూడా సులభతరంగా మారనున్నది.  


మూడువేల మందికి పైగా గుర్తింపు

మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న వారి లిస్టును మున్సిపాలిటీ అధికారులు సిద్ధం చేశారు. అందులో మూడువేల మందికిపైగా ఆస్తిపన్ను కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటువంటి వారిని గుర్తించిన అధికారులు వారి నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పన్ను కట్టలేని వారి దుకాణ సముదాయాలకు మున్సిపాలిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో 5 షాపులను సీజ్‌ చేశారు. 

ఫిబ్రవరి చివరికి 50శాతం పూర్తి

2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5కోట్లకు గాను ఫిబ్రవరి మొదటి వారం వరకు రూ. కోటి 75లక్షలు (37 శాతం) మాత్రమే వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మొదలుకుని ఫిబ్రవరి నాటికి మొత్తం రూ.2.50 కోట్లు (50 శాతం) వసూలు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు చేయడంలో ముందంజలో ఉన్నది. 

VIDEOS

తాజావార్తలు


logo