మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 11, 2020 , 23:54:50

ప్రచార హోరు

ప్రచార హోరు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అన్ని సింగిల్‌ విండోలను సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ఎన్నికల బరిలో ముం దుకు సాగుతుంది. పార్టీ తరుపున నామినేషన్‌ వేసిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించేందుకు చాకచక్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 39 వా ర్డులను ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న గులాబీ పార్టీ అన్ని సహకార సంఘాలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇది వరకు జరిగిన ఎన్ని కల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకునేందుకు టీ ఆర్‌ఎస్‌ కార్యకర్తలు అహర్నిశలు కృషి చే స్తున్నారు. 

ప్రతి ఓటూ విలైవైనదే

ఈ ఎన్నికల్లో కేవలం రైతులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండటంతో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 59,756 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.  దీంతో ప్రతి ఓటును విలువైనదిగా అభ్యర్థులు భావిస్తున్నారు. వలస వెళ్లిన ఓటర్లను కూడా తిరిగి గ్రామాలకు  వచ్చి త మకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్క ఓటరును ప్రసన్నం చేసుకుంటున్నారు. 

పథకాలే ప్రచార అస్ర్తాలు

టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అ భ్యర్థులను పథకాలనే ప్రచార అస్ర్తాలుగా విని యోగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు భీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, వా హనాలు, రుణమాఫీ వంటి పథకాలను రైతులకు గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహి స్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని చాటిచెబుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ఓట ర్లను గుర్తించి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చే స్తున్నారు. తమ పరిధిలోని సహకార సం ఘంపై గులాబీ జెండాను ఎగరువేస్తే గతం లో రైతులకు ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపి స్తామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. 

జోరుగా ఎమ్మెల్యేల పర్యటనలు

జిల్లాలోని అన్ని సహకారం సంఘాలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఎమ్మె ల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీ ఎం అబ్రహంలు పక్కా వ్యూహంతో ముం దుకు వెళ్తున్నారు. అన్ని విండోల పరిధిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వ హించి విజయాన్ని సాధించేలా వ్యూహన్ని పన్నుతున్నారు. కార్యకర్తలందరికీ ప్రచార సరళిని వివరించి ప్రతి ఒక్క ఓటరును ప్రస న్నం చేసుకో వాలని సూచించారు. అంత ర్గత సమావేశాలతో పాటు  అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్యటనలు నిర్వహి స్తున్నారు. ప్రజలకు అభి వాదం చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అ భ్యర్థులను గెలిపించాలని  కోరుతున్నారు. 


logo
>>>>>>