సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 23:52:32

సహకార ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులదే కీలకపాత్ర

సహకార ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులదే కీలకపాత్ర

గద్వాల, నమస్తేతెలంగాణ:  సహకార ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్‌ అధికారులది కీలక పాత్ర ఉంటుందని ఆర్డీవో రాములు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో ప్రిసైడింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 15న ఉద యం 7గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభించి మధ్యాహ్నం 1గంట వరకు పూర్తవుతుందన్నారు. అనంతరం అదేరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి లెక్కింపు చేసి ఫలితాలు వెలువ రించాల్సి ఉంటుందని, ప్రిసైడింగ్‌ అధికారులు చాలా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. కొన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని ఎన్నికలు సైతం కొన్ని చోట్ల నువ్వా, నేనా అన్నట్లు జరగవచ్చని కాబట్టి ప్రిసైడింగ్‌ అధికారులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నియమ ని బంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు  కృషిచేయాలన్నారు. నియమ నిబంధనలు ఒకటికి రెండు సార్లు చదువుకొని నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14న స్థానిక మార్కెట్‌ యా ర్డులో  డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినందున ఉదయాన్నే ప్రిసైడింగ్‌ అధికారులతో పాటు ఇతర పోలింగ్‌ సిబ్బంది హా జరై తమ బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్స్‌లు, ఇతర పోలింగ్‌ సామగ్రిని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంస్థ అధికారి ప్రసాద్‌రావు, మాస్టర్‌ ట్రైనర్లు, ప్రిసైడింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo