గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 23:51:45

భక్తి శ్రద్ధలతో నందికోల సేవ

భక్తి శ్రద్ధలతో   నందికోల సేవ

అయిజ : మేళతాళాలు, భాజ భజంత్రీలు మార్మోగుతుండగా .. భక్తుల శివ నామస్మరణలు, నందికోల సేవల నడుమ తిక్కవీరేశ్వరుడు పురవీధుల గుండా ఊరేగాడు. పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవాలకు మంగళవా రం అంకుర్పాణ చేస్తూ తిక్కవీరేశ్వరస్వామిని చూడముచ్చటగా అలంకరించిన ఎడ్లబండిపై ఆశీనులను చేసి పట్టణంలో పురవీధుల గుండా భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఎన్నడు లేనంతగా తిక్కవీరేశ్వర స్వామి ఊరేగింపులో భక్తులు ఆశేషంగా పాల్గొన్నారు. సంప్రదాయ బద్ధంగా.. భక్తుల శివ నామస్మరణల మధ్య ఆలయ పూజారి పాగుంట లక్ష్మిరెడ్డి స్వగృహం నుంచి తిక్కవీరేశ్వర స్వామిని ఎడ్లబండిపై ఆశీనులను చేసి ఊరేగింపుగా ఆంజనేయస్వామి దేవాలయం, పాత బస్టాండ్‌ మీ దుగా తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి చేర్చా రు. అనంతరం ఆలయ అర్చకులు కళశస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తూ పుట్టమన్ను తె చ్చి మా మిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో పందిరి వేసి స్వామికి ప్రత్యేక పూ జలు చేశారు. రాత్రి తిక్కవీరేశ్వర స్వామి ని మొండి చట్టం ఆశీనులను చేసి పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాల యం వరకు ఊరేగించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు, తిక్కవీరేశ్వర స్వామి యూ త్‌, భజన బృం దం, రైతు, హమాలీ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఏపీ కళాకారుల  ప్రదర్శనలు..

తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల్లో భా గంగా మంగళవారం నిర్విహించిన ఊరేగింపులో అమరావతి, ఒంగోలు, కడప, విజయవాడకు చెందిన మధు కళాకారుల బృందం సభ్యులు ప్రదర్శించిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నా యి. వేంకటేశ్వరస్వామి, శక్తి స్వరూపి ణి, మైసాసుర మర్ధిని, రాక్షసులు, నరసింహస్వామి అవతారంలో పలు ప్రదర్శనలు చేశారు. ప్రదర్శనలు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 

నేడు ప్రభోత్సవం..

తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవాల్లో భా గంగా మంగళవారం రాత్రి ప్రభోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్‌ దీపాల అలంకరణ చేశారు.logo