శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 00:50:04

ఏకగ్రీవాలు@ 39

ఏకగ్రీవాలు@ 39

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల విత్‌డ్రా ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలింది. వీటితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితాను, పోలింగ్‌ నిర్వహించనున్న వార్డుల జాబితాను కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాన కార్యక్రమాలు ముగియడంతో ఇక నేటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాలను నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం ప్రచారం చేపట్టాలని పోటీలో నిలిచిన అభ్యర్థులకు జిల్లా ఎన్నికల అధికారులు ముందస్తుగానే సూచనలందించారు. సహకార ఎన్నికల్లో ఓటువేసే రైతుల సంఖ్య పరిమితంగా ఉండటంతో అభ్యర్థులు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గెలుపును సొంతం చేసుకునేందుకు అభ్యర్థులు నేటి నుంచి జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. 

విత్‌డ్రా చేసుకున్న 172 మంది

ఎన్నికల సంఘం నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు విత్‌ డ్రాకు అవకాశం కల్పించడంతో శుక్రవారం జిల్లాలో మొత్తం 172 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 11 సొసైటీల పరిధిలో 143 వార్డులకు ఎన్నికల అధికారులు నామినేషన్లను ఆహ్వానించగా 453 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 433 నామినేషన్లను ఆమోదించారు. అత్య ధికంగా గట్టులో 31 మంది విత్‌డ్రా చేసుకోగా అత్యల్పంగా క్యాతూర్‌లో ఒక నామినేషన్‌  మాత్రమే విత్‌డ్రా చేసుకున్నారు. వీటిలో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంతో మొత్తం బరిలో 261 మంది అభ్యర్థులు న్నట్లు ప్రకటించారు. సొసైటీల వారీగా గద్వాలలో 18 మంది విత్‌డ్రా చేసుకున్నారు. ధరూర్‌లో 24 మంది విత్‌డ్రా చేసుకోగా 30 మంది బరిలో, మల్దకల్‌లో 24 మది విత్‌డ్రా చేసుకోగా 24 మంది బరిలో, అయిజలో 25 మంది విత్‌ డ్రా చేసుకోగా బరిలో 29 మంది,  గట్టులో 31 మంది విత్‌డ్రా చేసుకోగా బరిలో 28 మంది, అలంపూర్‌లో 9 మంది విత్‌డ్రా చేసుకోగా బరిలో 22 మంది భరిలో, కలుగొట్లలో 5 మంది విత్‌డ్రా చేసుకోగా 22 మంది బరిలో ఉన్నారు. పుటాన్‌దొడ్డిలో4 మంది విత్‌డ్రా చేసుకోగా 17 మంది బరిలో, క్యాతూర్‌లో 1 మంది విత్‌డ్రా చేసుకోగా 17 మంది బరిలో, వడ్డేపల్లిలో 19 మంది విత్‌డ్రా చేసుకోగా 27 మంది బరిలో, మానపాడులో 12 విత్‌డ్రా చేసుకోగా బరిలో 17 మంది ఉన్నారు. 

ఏకగ్రీవంగా 31 మంది

విత్‌డ్రా ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 143 స్థానాలో 31 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యయారు. దీంతో ఎన్నికల అధికారులు 11 సొసైటీల పరిధిలో 103 స్థానాలకే పోలింగ్‌ చేపట్ట నున్నారు. సొసైటీల వారిగా పుటాన్‌దొడ్డిలో 9 మంది, మానవపాడులో 9 మంది, కలుగొట్లలో 5 మంది, క్యాతూర్‌లో 7 మంది, అలంపూర్‌లో 5 మంది, వడ్డేపల్లిలో ఒకరు, మల్దకల్‌లో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  


logo