గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 10, 2020 , 00:31:04

433 నామినేషన్లు ఆమోదం

433 నామినేషన్లు ఆమోదం

జోగుళాంబ గద్వాల ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ముగించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 453 నామినేషన్లు దాఖలుకాగా, వాటిలో 17 డబుల్‌ నామినేషన్లు, 4 నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరిచారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 143 వార్డుల్లో 433 మంది బరిలో ఉన్నారు. అలంపూర్‌లో 2, కలుగొట్లలో 1, క్యాతూర్‌లో 1 నామినేషన్‌ను తిరస్కరించినట్టు ప్రకటించారు. క్యాతూర్‌లో 10వ వార్డులో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలుకాగా, ఆ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు స్క్రూట్నీలో తొలగించారు. ఇక ఈ రోజు విత్‌డ్రాకు అవకాశం కల్పించడంతో ఏకగ్రీవం అయ్యే వార్డుల సంఖ్య తేలనుంది. 

సహకార ఎన్నికల్లో ప్రధానఘట్టం ముగిసింది. సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించారు. అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించారు. విత్‌డ్రా ప్రక్రియ అనంతరం వార్డుల్లో పోటీదారులు క్షేత్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించనున్నారు. 

433 నామినేషన్లు ఆమోదం

జిల్లాలోని 11 సహకార సంఘం పరిధిలోని 143 వార్డులకు మొత్తం 433 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. స్క్రూట్నీలో ఎన్నికల అధికారులు 453 నామినేషన్లను పరిశీలించారు. వాటిలో 16 నామినేషన్లు డబుల్‌ వచ్చినట్లు గుర్తించి వాటిని తొలగించారు. ఇక మిగిలిన 437 నామినేషన్లలో స్క్రూట్నీ నిర్వహించి 4 నామినేషన్లు తి రస్కరించారు. వాటిలో అలంపూర్‌లో 2 నామినేషన్లు, క్యాతూర్‌లో 1నామినేషన్‌, కలుగొట్లలో 1నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 

క్యాతూర్‌లో దాఖలైన ఒక నామినేషన్‌ తిరస్కరణ

క్యాతూర్‌ సహకార సంఘంలో 10వార్డులో దాఖలైన ఒకే ఒక్క నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఓసీ ఉమెన్‌కు కేటాయించిన ఈ వార్డును ఆ గ్రామస్థులు ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ఒకే ఒక్క మహిళతో నామినేషన్‌ను వేయించారు. ఏకగ్రీవం అవుతుందని భావించగా, గ్రామస్థులకు ఎన్నికల సంఘం అధికారులు షాకింగ్‌ న్యూస్‌ను తెలియజేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నందున తిరస్కరించినట్టు ప్రకటించారు. సహకార ఎన్నికల అనంతరం ఈ వార్డుపై ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అలంపూర్‌లో తిరస్కరించిన 1వార్డు, 10వ వార్డులో ఒక నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఇద్దరు కంటే ఎక్కవ సంతానం ఉన్నారనే కారణంతో తిరస్కరించారు. అలంపూర్‌లో 1వార్డులో కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలవడం వాటిలో ఒకటి తిరస్కరించడంతో ఈ వార్డు ఏకగ్రీవమైంది. ఇక కలుగొట్లలోని 11వ వార్డులో కూడా కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలవడం, వాటిలో ఒక నామినేషన్‌ను తిరస్కరించడంతో ఈ వార్డు కూడా ఏకగ్రీవమైంది. 

నేడు విత్‌డ్రా

ఈ రోజు ఎన్నికల అధికారులు విత్‌డ్రాకు అవకాశం కల్పించారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్న వార్డుల్లో కొన్ని విత్‌డ్రా కావడంతో ఏకగ్రీవమయ్యే వార్డుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికి 19 వార్డుల్లో కేవలం ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యాయి. వాటిలో క్యూతూర్‌లో 10వ వార్డులో  దాఖలైన ఒకే నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇక అదనంగా అలంపూర్‌లో 1వ వార్డు, కలుగొట్లలో 11వ వార్డులో ఒకే ఒక్క నామినేషన్‌ ఆమోదించడంతో ఇప్పటి వరకు మొత్తం 20 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రోజు విత్‌డ్రా చేసుకునే నామినేషన్ల ఆధారంగా ఏకగ్రీవమయ్యే వార్డుల సంఖ్యల తేలనుంది.  


logo