గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 10, 2020 , 00:25:42

జములమ్మ.. దీవించమ్మా

జములమ్మ.. దీవించమ్మా

గద్వాలటౌన్‌: నడిగడ్డ ఇలవేల్పు జమ్మిచేడు జములమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మను దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి వేలాదిమంది భక్తులు తరలొచ్చారు. మాఘశుద్ధ పౌర్ణమి ఆదివారం అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గద్వాలలో కొలవుదీరిన జమ్మిచేడు జమ్ములమ్మకు మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. అదేవిధంగా పరుశరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జములమ్మ ఆలయం ఎదుట కొలువుదీరిన ముక్కిడమ్మ, జంట నాగులకు ఆలయ అర్చకులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శిచుకునేందుకు భక్తులు పోటెత్తారు. పుష్కరఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో అమ్మను కొలిచారు. 

పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు కృషి

జమ్మిచేడు జములమ్మ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. అమ్మవారికి  ఎమ్మెల్యే దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఆమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు శేషావస్త్రంతో సన్మానించి ఆశ్విరచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ అధికారులకు సూచించారు. ప్రజలందరూ పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ఈవో వీరేశం, టీఆర్‌ఎస్‌ నాయకులు సతీశ్‌, శ్రీరాములు, భాస్కర్‌రెడ్డి, వినోదాచారి తదితరులు ఉన్నారు. 


logo