శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 10, 2020 , 00:19:01

రమణీయం జములమ్మ రథోత్సవం

రమణీయం జములమ్మ రథోత్సవం

ఉండవెల్లి : బారుతాల పున్నమిని పురస్కరించుకొని కంచుపాడు జములమ్మ అమ్మవారికి భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి జములమ్మ అమ్మవారికి కుడుములు, గుగ్గీలు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఆలయ నిర్వహకులు భక్తులకు దర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్‌లు ఏర్పాటుచేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం జములమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించగా ఆలయ నిర్వహకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి శాలువా, పూలమాలతో సత్కరించారు. వీరి వెంట జెడ్పీటీసీ రాములమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు బైరాపురం రమణ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు రథోత్సవం నిర్వహించగా జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తుల కోలాహలంతో గ్రామంలో సందడి నెలకొంది. 


logo