శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 08, 2020 , 01:32:02

భక్తజన ప్రియ గోవింద..

భక్తజన ప్రియ గోవింద..

గద్వాల టౌన్‌: గద్వాల కోటలో కొలువుదీరిన శ్రీ భూలక్షీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) స్వామివారికి విశేష ఫల పంచామృతాభిషేకం, సాయంకాలం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మయూర వాహనంపై ఊరేగిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తి పారవశ్యంలో ముగినిపోయారు. ఆలయ విచారణకర్త ప్రభాకర్‌, మఠం మేనేజర్‌ సంప్రతిమోహన్‌, ఆలయ అర్చకులు శ్రీనివాసచారిలు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ను సత్కరించారు. 

ఘనంగా సీతారాముల కల్యాణం..

కోటలోని రామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు (శనివారం) సాయంత్రం 6గంటలకు భూలక్ష్మీచెన్నకేశవస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. స్వామివారి కల్యాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. logo