శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 08, 2020 , 01:30:50

గద్వాల చేనేతను పరిశీలించిన ఒడిశా కార్మికులు

గద్వాల చేనేతను పరిశీలించిన ఒడిశా కార్మికులు

గద్వాలటౌన్‌ : గద్వాల చేనేతను పరిశీలించి, ప్రాముఖ్యతను తెలు సు కునేందుకు గాను శుక్రవారం ఒడిశా చేనేత కార్మికులు గద్వాలకు చేరుకున్నారు. ఈమేరకు  జిల్లా కేం ద్రం గద్వాలలో ఉన్న చేనేత మగ్గాలను వారు సందర్శించారు. నేత మగ్గాలపై చీరలు నేసే విధానాన్ని, కార్డు పంచింగ్‌ యూనిట్‌లను స్థా నిక కార్మికులతో అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తం గా పేరు గాంచిన గద్వాల జరీ చీరల నేత విధానాన్ని తెలుసుకున్నారు. నేత రంగంలో కార్మికుల నైపుణ్యాన్ని పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పర్యటన ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఒడిశా కార్మికులు తెలిపారు. తమ ప్రాంతంలో కూడా గద్వాల నేతను అమలులో పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు చరణ, అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, వీవర్స్‌ సర్వీసు సెంటర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, బర్గర్‌, ఒరిస్సా రాష్ర్టాలకు కార్మికులు గోపాలకృష్ణ పాత్రో, జూనియర్‌ సూపర్‌వైజర్‌ మాయదర్‌బెహ్ర తదితరులు పాల్గొన్నారు. 


logo