బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 08, 2020 , 01:27:17

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

కొనసాగుతున్న నామినేషన్ల పర్వంమల్దకల్‌ : మండల సింగిల్‌ విండో కార్యాలయానికి జరుగబోయే 13 డైరెక్టర్ల ఎన్నికలకు శుక్రవారం 22 మంది నామినేషన్లను వేసినట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్‌, సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డిలు తెలిపారు. 1వ వార్డుకు- 2,2వ వార్డుకు -1,3వ వార్డుకు -2, 4వ వార్డుకు - 2, 5వ వార్డుకు -3, 6వ వార్డుకు -నిల్‌, 7వ వార్డుకు -1, 8వ వార్డుకు -2, 9వ వార్డుకు- 2, 10వ వార్డుకు- 3, 11వ వార్డుకు-3, 12వ వార్డుకు- నిల్‌, 13వ వార్డుకు -1 చొప్పున నామినేషన్లు వేసినట్లు వారు తెలిపారు. ఇప్పటివరకు 22 నామినేషన్లు వచ్చాయన్నారు.  ఇంకా చివరి రోజు  ఉందని  ఇంకా నామినేషన్లు వేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

జోరుగా నామినేషన్లు..

సింగిల్‌ విండో ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బలపర్చిన అభ్యర్థులు 10 మంది శుక్రవారం తమ నామినేషన్లను వేశారు. అదేవిధంగా సింగిల్‌ విండో అధ్యక్షుడు బలపర్చిన శేషంపల్లి తిమ్మారెడ్డి 10వ వార్డు డైరక్టర్‌గా ఈ రోజు నామనేషన్‌ వేశాడు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వీరన్న,  సింగిల్‌ విండో అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్‌లు వెంకటేశ్వర్‌రెడ్డి, కిష్టన్న, కృష్ణ, పురుషోత్తంరెడ్డి, శివరామిరెడ్డి, యాకోబు, ప్రతాప్‌, ఎంపీటీసీలు పెద్దగోపాల్‌రెడ్డి, రాజు, పరుశరాముడు, నాయకులు   ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, నరేందర్‌, విక్రంసింహారెడ్డి, రామచంద్రారెడ్డి,  మాజీ ఎంపీటీసీ వెంకటన్న, ఉప సర్పంచ్‌ మల్దకల్‌, బాబురావు, ధర్మారెడ్డి, అజయ్‌, తూంకృష్ణారెడ్డి, పటేల్‌ జనార్ధన్‌రెడ్డి,  కిష్టన్న, భానుప్రకాశ్‌రెడ్డి, శేషాద్రినాయుడు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

రెండో రోజు స్వల్పంగా.. 

ధరూరు: సహకార ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండో రోజు 13 నియోజకవర్గాలకు గాను 1, 2, 12, 13 నియోజకవర్గాలకు నామినేషన్ల్‌ దాఖలైనట్లు ఎన్నికల అధికారి రా జానందం తెలిపారు. అందులో ఒకటవ నియోజక స్థానాని కి నలుగురు అభ్యర్థులు, 12వ స్థానానికి ఇద్దరు, 2, 13 స్థా నాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైనట్లు ఆయన తెలిపారు . 


logo