గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 07, 2020 , 00:23:45

తొలిరోజు 14

తొలిరోజు 14
  • సహకార పోరుకు నామినేషన్లు షురూ
  • అత్యధికంగా పుటాన్‌దొడ్డిలో 6నామినేషన్లు
  • ధరూర్‌, మల్దకల్‌, వడ్డేపల్లిలో నమోదుకాని నామినేషన్లు
  • సహకార కార్యాలయాల వద్ద బందోబస్తు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటిరోజు మంద కొడిగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 143 స్థానాలకుగాను తొలి రోజు కేవలం 14 నామినేషన్లు మాత్రమే అధికారులు స్వీకరించారు. అత్యధి కంగా పుటాన్‌దొడ్డి సింగిల్‌ విండో నుంచి 6నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా అన్ని విండోల్లో నామమాత్రంగా నామినేషన్లు వేశారు. ధరూర్‌, మల్దకల్‌, వడ్డేపల్లిలో ఒక్కనామినేషన్‌ కూడా నమోదుకాలేదు.  నేడు, రేపు నామినేషన్లు భారీగా రావచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పీఏసీసీఎస్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.


మొదటిరోజు నామినేషన్ల పర్వం మొక్కుబడిగా కొనసాగిం ది. నామినేషన్‌ వేసేందుకు ఈ నెల 8వరకు సమయం ఉండటంతో పోటీ దా రులు తొలి రోజుల అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీల నుంచి హమీ కోసం కొంత మంది పోటీదారులు వేచిచూడగా మరకొందరు సుముహుర్తం కోసం వేచిచూస్తున్నారు. సమయం సమీపిస్తుండటం తో ఈరోజు, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 


మొదటి రోజు మందకొడిగా..

ఎన్నికల సంఘం ప్రకటించని షె డ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి నా మినేషన్లు స్వీకరించారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న 143 స్థానాల నుంచి 14 నామినేషన్లు దాఖలయ్యా యి. వీటిలో పుటాన్‌దొడ్డి సింగిల్‌ విండో నుంచి అత్యధికంగా 6నామినేషన్లు నమోదవ్వగా ధరూర్‌, మల్దకల్‌, వడ్డేపల్లిల నుంచి ఒక్క నామినేషన్‌ కూ డా దాఖలు కాలేదు. నమోదైన నామినేషన్లలో గద్వాల  నుంచి ఓసీ జనరల్‌ కేటగిరి నుంచి ఒక నామినేషన్‌, అలంపూర్‌లో ఓసీ జనరల్‌ నుంచి ఒక నామినేషన్‌, కలుగొట్ల నుంచి ఓసీ జనరల్‌ 1, ఎస్టీ జనరల్‌ 1 మొత్తం 2నామినేషన్లు, పుటాన్‌దొడ్డి నుంచి బీసీ జనరల్‌ 3, ఓసీ జనరల్‌ 2, ఎస్టీ జనరల్‌ 1 మొత్తం 6నామినేషన్లు దాఖలయ్యాయి. క్యాతూర్‌లో ఓసీ జనరల్‌ ఒక నామినేషన్‌, అయిజలో ఓసీ జనరల్‌ ఒక నామినేషన్‌, గట్టులో ఓసీ జనరల్‌ ఒక నామినేషన్‌, మానవపాడులో ఓసీ జనరల్‌ ఒక నామినేషన్‌ దాఖలయ్యాయి. 


బందోబస్తు ఏర్పాటు

సహకార సంఘాల కార్యాలయాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్రాల సమీపంలో ట్రాఫిక్‌ అంక్షలు విధించి వాహనాలను దారి మళ్లీంచారు. వివిధ పార్టీల కార్యాకర్తలు సహకార సంఘం కార్యాలయం దగ్గర గుంపులు గుంపులుగా ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల అధికారులు నామినేషన్‌ స్వీకరణకు సంబంధించి అ న్ని ఏర్పాట్లను పక్కగా చేపట్టారు. పోటీ దారుల నుంచి నిబంధనల ప్రకారం నామినేషన్లను స్వీకరించారు.   


logo
>>>>>>