సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 07, 2020 , 00:21:50

హనుమద్వాహనంపై చెన్నకేశవుడు

హనుమద్వాహనంపై చెన్నకేశవుడు

గద్వాలటౌన్‌ : గద్వాల కోటలో వెలసిన భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రా రంభమయ్యాయి.. పండితుల వేదమంత్రోచ్ఛరణలు కోటలో ప్రతిధ్వనించాయి.. ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారు విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.. రాత్రి హనుమద్‌ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంత్రాలయ పీఠాధిపతి  సుభుదేంద్ర తీర్థుల శ్రీపాదులవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు  ఉద యం 8 గంటలకు మూల విరాట్‌కు నిత్య విశేష ఫల పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. అలాగే సాయంకాలం పుణ్యహవచనం, దేవతా ఆహ్వానం, దీక్ష వస్త్రం, కలశ స్థాప నం, గోపూజ కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. రాత్రి 9గంటలకు స్వామివారిని హనుమద్‌ వాహనంపై ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం మహా మంగళహారతి ఇచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల ప్రారంభ  కా ర్యక్రమానికి మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అలాగే శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ విచారణ కర్త ప్రభాకర్‌ తెలపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు.


కలెక్టర్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

గద్వాలటౌన్‌ : కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలకు మంత్రా లయ పీఠాధిపతి తరపున మఠం మేనేజన్‌ సంప్రతి మోహన్‌, మాజీ కౌన్సిలర్‌ భీంసెన్‌రావులు కలెక్టర్‌ శ్రుతి ఓఝూను గురువారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, కోట విశిష్టతను కలెక్టర్‌కు వివరించామని వారు తెలిపారు. కలెక్టర్‌ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు వారు చెప్పారు. 


logo