మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 07, 2020 , 00:21:06

మూడు నెలలల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇవ్వాలి

మూడు నెలలల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇవ్వాలి

గద్వాల,నమస్తేతెలంగాణ: జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్‌లన్నింటికీ మూడు మాసాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చి సీనియారిటి ప్రకారం మెటీరియల్‌ అందజేయాలని ఎస్‌ఈ చక్రపాణి అధికారులను సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో విద్యుత్‌శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో స మావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ పవర్‌వీక్‌ సందర్భంగా గ్రామాల్లో పెండింగ్‌ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని, విద్యుత్‌ బిల్లులు చెల్లించిన గ్రామాలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 15రోజుల్లో డీడీలు కట్టిన అన్ని దరఖాస్తులకు ఎస్టిమేట్లు త యారు చేయాలన్నారు. అనధికార వి ద్యుత్‌ కనెక్షన్లను తప్పని సరిగా డీడీలు కట్టించి క్రమబద్దీకరించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లు లు చెల్లించని వారి విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామని, కట్‌ చేసిన కనెక్షన్‌ ఎవరైనా స్వయంగా పునరుద్ధరించుకుంటే విద్యు త్‌ చౌర్యం కేసులో జైలుకు పంపుతామని హెచ్చరించారు. వ్యవసాయ కనెక్షన్లు సీనియారిటి ప్రకారం మెటీరియల్‌ అందజేయాలని, ఏదైనా తక్కువైతే వాటిని డి పార్ట్‌మెంట్‌ కాంట్రాక్టర్ల్‌ ద్వారా రైతుకు ఒక్క రూపాయి ఖర్చుకాకుండా మొత్తం ఇచ్చి పని పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్ల రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయవద్దని ఒక వేళ ఎక్కువ సామాను కావల్సి వస్తే అంచనాలు రూపొందించి వాటి విలువను డీడీ రూపంలో వసూ లు చేయాలన్నారు. 


ధరూర్‌, గద్వాల మండలం నుంచి రైతులు కనెక్షన్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఈ మండలాల ఏఈలు సిబ్బంది, కాంట్రాక్టర్ల ఎక్కువగా శ్రమించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ధరూర్‌ మండలంలో అధికారులు, కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసే దిమ్మె వారే నిర్మించుకోవాలని చెప్పి కాంట్రాక్టర్లు వారి పేర బిల్లులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారి తీరు మార్చు కోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్‌ కోసం డీడీతో పాటు దరఖాస్తు చేసిన తర్వాత విద్యుత్‌ సిబ్బంది,గుత్తేదారునికి ఎటువంటి డబ్బులు చెల్లించవద్దని అన్ని ఎస్టిమేట్‌లు ఉచితంగా వేస్తారని చెప్పా రు. మొత్తం 16,998 దరఖాస్తుల్లో పను లు పూర్తి చేసి9,475 కనెక్షన్‌లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 718 దరఖాస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో నగదు చెల్లిం చనందుకు వాటిని పక్కకు పెట్టినట్లు చెప్పారు. 


162 దరఖాస్తులు వివిధ కారణాల చేత తిరస్కరించామన్నారు. మిగతా 6643 దరఖాస్తులు ప్ర స్తుతం తమ దగ్గర ఉన్నాయని వాటిని మూడు నెలల్లో క్లియర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. పాత మండలాల వారీగా అలంపూర్‌ 96, మానవపాడ్‌ 79, శాంతినగర్‌ 513, ఇటిక్యాల 287, అయిజ 755, గద్వాల 679, మల్దకల్‌ 999, గట్టు1387, ధరూర్‌19,60 వ్యవసాయ కనెక్షన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఏదైనా గ్రామంలో పవర్‌ వీక్‌ ప నులు పూర్తి కాకపోతే ఆధారాలతో సంబంధిత సహాయక ఇంజనీర్‌కులేదా డివిజన్‌ ఇంజ నీర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి పనులు పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. విద్యుత్‌ బిల్లులను పట్టణంలో 10వ తేదీ వరకు గ్రామాల్లో 12వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలు చేరుకొని సిబ్బంది అధికారులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివిజన్‌ ఇంజనీరు మోహన్‌తో పాటు విద్యుత్‌ శాఖ అధికారులు శ్రీనివాస్‌, ఏఈ లు, సబ్‌ ఇంజనీర్లు, ఏఏవోలు, జేఏవోలు, గుత్తేదారులు పాల్గొన్నారు.logo
>>>>>>