ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Feb 06, 2020 , 02:37:57

ఎడ్ల బండిపై బైలెల్లిన జములమ్మ

 ఎడ్ల బండిపై బైలెల్లిన జములమ్మ
  • మెట్టినింటికి చేరిన జములమ్మ
  • ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని సూచన
  • ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
  • సంప్రదాయ బద్ధంగా స్వాగతం
  • అమ్మ రాకతో మురిసిన గద్వాల

గద్వాలటౌన్‌: కుర్వడోలు చప్పుళ్లతో.. బైండ్లొళ్ల చప్పుళ్లతో.. డప్పుల మోతలతో.. మేళ తాళాలతో అమ్మవారిని సంప్రదాయ బద్ధంగా జమ్మిచేడు గ్రామ ప్రజలు అమ్మను పుట్టినింటి నుంచి మెట్టినింటికి తీసుకొచ్చా రు. అమ్మకు స్వాగతం పలికేందుకు ప్రజలు బారులు తీరారు. అడుగడుగున పసుపునీళ్లు పోసి అమ్మను వే డుకున్నారు. ‘ఎల్లకాలం చల్లంగా చూడమ్మ’  అంటూ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ మెట్టినింటికి రావ డంతో గద్వాల మురిసిపోయింది. భక్తులు పరవశించి పోయారు. అమ్మను యథాస్థానంలో ప్రతిష్ఠించి  ప్రత్యేక పూజలు చేశారు.జోగుళాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన జములమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని మొదటి రోజు తన పుట్టినిల్లయిన గుర్రంగడ్డకు(దివిసీమ)మంగళవారం సంప్రదాయ బద్ధంగా సాగనంపారు. పుట్టినింట  భక్తులతో ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు తిరిగి బుధవారం మెట్టినిల్లయిన జమ్మిచేడుకు చేరుకుంది. ఈ క్రమంలో అమ్మ ను ప్రజలు సంప్రదాయ బ ద్ధంగా ఎద్దులబండిపై గ్రా మానికి స్వాగతం పలికారు. జములమ్మ కుమారుడిగా భక్తులతో కొలువబడుతూ భక్తులు కోరిన కోరికలు తీ ర్చుతున్న పరుశరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 


ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

జములమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆలయ అధికారులకు సూచించారు. బుధవారం జములమ్మ మెట్టినింట్టి రాక సందర్భంగా అమ్మకు ప్రత్యేక పూజ లు నిర్వహించి అమ్మకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించాలన్నారు. పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo