గురువారం 09 ఏప్రిల్ 2020
Gadwal - Feb 06, 2020 , 02:34:44

ప్రభుత్వ పథకాలు రైతులకు వివరించండి

ప్రభుత్వ పథకాలు రైతులకు వివరించండి

మల్దకల్‌:  సింగిల్‌ విండో ఎన్నికలలోమండలంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవే యా లని ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్‌ రెడ్డి  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు. బుధవారం మండలంలోని పార్టీ కార్యాలయంలో మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ముందుగా ఓటర్లతో గ్రామా గ్రామానా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన  పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమాలతో పాటు పింఛన్లు ఇతర పథకాలను వారికి తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉం దని సింగిల్‌ విండోలు కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ   పార్టీ అభ్యర్థులే గెలువాలన్నారు. కార్యక్రమంలో  ఎంపీపీ రాజారెడ్డి,  వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, సింగిల్‌ విండో అధ్యక్షుడు మాణిక్య రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ ప్రహ్లదరావు, సీతారామిరెడ్డి,  నరేందర్‌, రామచంద్రారెడ్డి, తిమ్మారెడ్డి, వెంకటన్న, ఉప సర్పంచ్‌ మల్దకల్‌, సవారప్ప,  ఎంపీటీసీ పెద్ద గోపాల్‌ రెడ్డి, సర్పంచులు యాకోబు,  వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.    logo