శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 06, 2020 , 02:20:02

శివస్వాములకు ముస్లిం సోదరుడి భిక్ష

శివస్వాములకు ముస్లిం సోదరుడి భిక్ష

గట్టు : శివమాల ధరించిన శివస్వాములకు ముస్లిం భిక్ష పెట్టి మతాన్ని పక్కనబెట్టి సోదరభావాన్ని చాటాడు. మండలంలోని బుధవారం బోయలగూడెం గ్రామానికి చెందిన ముస్లిం ముల్లబాబుసాబ్‌ కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యారు. ద వాఖానలో చికిత్స పొంది కోలుకున్నాడు.  తన ఆరోగ్యం బాగుకావాలని దేవున్ని ప్రార్థించడంతోనే నయమైందని భావించిన అతను భిక్ష ఇస్తానంటూ శివస్వాములకు తెలిపారు. దీనికి వారు అంగీకరించడంతో శివస్వాములకు మధ్యాహ్నం భిక్షను ఇచ్చి స్వయంగా  స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం ముల్లబాబుసాబ్‌కు శివస్వాములు కృతజ్ఞతలు తెలియజేశారు.


logo