గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 05, 2020 , 00:08:49

కారుకే సహకారం

కారుకే సహకారం
  • ఏకపక్ష నిర్ణయం తీసుకోనున్న రైతులు
  • టీఆర్‌ఎస్‌తోనే విండోల అభివృద్ధి సాధ్యమనే చర్చ
  • ప్రభుత్వ పథకాలే నిదర్శనమంటున్న కర్షకులు
  • మండలాల వారీగా ఎమ్మెల్యే సమావేశాలు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘం ఎన్నికలు రావడంతో గ్రామాల్లో రైతులు చర్చలు మొదలుపెట్టారు. గత 5ఏళ్ల కా లంలో రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలనే గుర్తు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం  కూడా ప్రవేశపెట్టని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి కేసిఆర్‌ రైతుల కు ఆత్మబంధువువయ్యారని చర్చించుకుం టున్నారు. పెట్టుబడి సహాయాన్ని అందించి వలస వెళ్లిన రైతులను కూలీలను, రైతులను తిరిగి గ్రామలకు వాపస్‌ వచ్చేలా చేసిన నేతయని కొనియాడుతున్నారు. రైతుభీమా పథకాన్ని ప్రవేశపెట్టి చనిపోయిని రైతు కుటుంభాలు రోడ్డున పడకుండా ఆదుకున్న గొప్ప నాయకుడని గుర్తుచేసుకుంటున్నారు. వీటి తో పాటు రుణమాఫీ చేపట్టి, సబ్సిడీ ద్వారా వాహనాలను, వ్యవసాయ యంత్రాలను అందించిన ఘణత కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే దక్కుతుందని రైతులు చర్చించుకుంటున్నారు.


రైతుల కోసం వివిధ పథకాలు

వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ దేశంలో ఏ నాయకుడు చేప ట్టని అద్భుతమైన పథకాలను ప్రవేశపె ట్టా రు. జిల్లాలోని 11 సింగిల్‌ విండోల ఆధర్యం లో మొత్తం 1,43,865 మంది స భ్యులు న్నారు. వీరందరి కోసం సహకార చట్టం ప్రకారం జిల్లాలో మొత్తం  1,008 సంఘా లను రిజిస్ట్రర్‌ చేశారు. వీటి ద్వారా రూ.2 కోట్ల21లక్షల విలువైన 5,884 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను రైతులకు అం దించారు. వీటితో పాటు రూ.2కోట్ల 75 లక్షల విలువై న 2,962 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. జిల్లాలో మొత్తం 93,529 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఈ వానాకాలం సీజ న్‌లో రూ. 127కోట్ల 47 లక్షలను వారి ఖా తాలో జమ చేశారు. దీనితో పాటు రైతు భీమా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మరణించిన 653 మంది రైతుల కుటుం బాలకు రూ.5లక్షల చొప్పున రూ.32కోట్ల 65లక్షలను అందిం చారు.  వీటితో పాటు ఉద్యానవన పంట లను ప్రోత్సహించేందుకు శాశ్వత పందిర్ల సాగు, మల్చింగ్‌లపై రైతుల కు శిక్షణలను అందించారు. జిల్లా వ్యాప్తంగా 1,227 హెక్టార్ల విస్తీర్ణంలో పందిర్ల సాగు, మల్చిం గ్‌లను ప్రోత్సహించేందుకు రూ.69 లక్షల 78వేలు విడుదల చేశారు. పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం  మూడు  సీసీఐ కేంద్రాలను, రెండు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను, రెం డు పప్పు శనగ కొనుగోలు కేంద్రాలను కూ డా ఏర్పాటు చేసింది. 


కర్షకుల మద్దతు టీఆర్‌ఎస్‌కే

గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలపట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ పాలనలో రైతులు ఎదుర్కొన్న సమ స్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతు రాజ్యంగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దు తున్నారు. ప్రతి రైతుకూడా నేడు రాష్ట్రంలో ధైర్యంగా వ్యవసాయన్ని సాగుచేసే పరిస్థితు లను కల్పించారు. సాగు నీటిని అందించేం దుకు కావల్సిన ప్రాజెక్ట్‌లను నిర్మాణం చేపట్టి చెరువుల్లో రిజర్వాయర్లలో రెండు పంటలకు కావల్సిన నీటిని అందిస్తున్నారు. ఈ పరిణా మాలన్నింటిని, మార్పులను గమనిస్తున్న రైతులు టీఆర్‌ఎస్‌ వైపు నిలిచేందుకు నిర్ణ యించుకుంటున్నారు. గ్రామాల్లో సమావే శాలు నిర్వహిస్తూ మూకుమ్మడి నిర్ణయా లను తీసు కుం టున్నారు. 


విండోల వారీగా సమావేశాలు

సహకార ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎంల విబ్రహంలు విండోల వారీగా సమావేశాలు నిర్వ హి స్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను, ముఖ్యనాయకులను ఈసమావేశాలను ఆ హ్వానించి సహకార సంఘం ఎన్నికలకు సం బంధించిన అభిప్రాయాలను సేకరిస్తున్నా రు. విండో చైర్మన్‌ అభ్యర్థులను, డైరెక్టర్‌ అ భ్యర్థులను ఎవరిని నిర్ణయించాలని సమి ష్టి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటు న్నారు. రైతుల సమస్యలపై అవగాహన, స్థా నికంగా పలుకుబడి, ప్రజల్లో ఆయా వ్య క్తులపై అభిప్రాయాలు సేకరించి పార్టీకి నిబ ద్ధుడిగా ఉండే వారికే సహకార సంఘం టికెట్లను అందిస్తున్నారు.  


logo