మంగళవారం 07 ఏప్రిల్ 2020
Gadwal - Feb 05, 2020 , 00:06:15

ఆడపడుచులకు సర్కారు అండ

ఆడపడుచులకు సర్కారు అండ

ఉండవెల్లి  : ఆడపడుచులకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పేర్కొన్నారు. అలంపూర్‌ చౌరస్తా క్యాంప్‌ కార్యాలయంలో అలంపూర్‌ మండలంలోని ఆయా గ్రామాల 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే అబ్రహంతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్ల్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగుబలహీన వర్గాలవారికి దేవుడయ్యాడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, తాసిల్దార్‌ మదన్‌మోహన్‌, నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, బీచుపల్లి, ధనుంజయ పాల్గొన్నారు.


వడ్డేపల్లిలో.. 

మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి చెక్కులు 70 సిద్ధంగా ఉన్నాయని వాటిని అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే అబ్రహం క్యాంప్‌ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం పంపిణీ చేయనున్నట్లు తాసిల్దార్‌ వెంకటరమణ తెలిపారు. కొంకల 9, జిల్లెడదిన్నె 3, కోయిలదిన్నె 3, బుడమర్సు 2, రామాపురం 5, జూలేకల్‌ 12, తనగల 6, పైపాడు 7, వడ్డేపల్లి 23 మందికి ఈ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.


logo