శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 05, 2020 , 00:04:11

సహకార ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

సహకార ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

గద్వాల,నమస్తేతెలంగాణ: జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ శ్రుతిఓఝూ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో జిల్లా కోఆపరేటివ్‌ అధికారి, నోడల్‌ అధికారులతో సహకార సం ఘాల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. బ్యాలెట్‌ బాక్సులను సమకూర్చుకోవటం, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, ప్రిసైడింగ్‌ అధికారుల ఎంపిక వారికి తగిన శిక్షణ వంటి అంశాలను నోడల్‌ అధికారులు జాగ్రత్తగా సకాలంలో చేపట్టాలని ఆదేశించారు. డ్రిస్టిబ్యూసెన్‌ సెంటర్‌ను మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించాలని అందుకు సరిపడా స్థలం, గదులు జిల్లా కోఆపరేటివ్‌ అధికారికి అప్పగించాలని మార్కెట్‌ అధికారిణి పుష్ప మ్మను ఆదేశించారు.11ప్యాక్స్‌లకు 158 మంది పీవోలు, 158ఏపీవోలను, 272 మంది ఇతర పోలింగ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలని సీపీవో వెంకటరమణను ఆదేశించారు. ట్రాన్స్‌పోర్టు అధికారి ద్వారా ఎన్నికలకు కావల్సిన వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేదీన పోటిలో ఉన్న అభ్యర్థు ల తుది జాబితా వచ్చిన వెంట నే బ్యాలెట్‌ పేపర్లు ప్రింటింగ్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 15న ఎన్నికలు ఉన్నందున ఆ లోపు తీసుకోవాల్సిన అన్ని ముందస్తు చర్యలు సకాలంలో పూర్తి చేసుకోవాలని నోడల్‌ అధికారులను ఆదేశించారు. 


‘నర్సరీల పెంపకం వేగిరం చేయండి’

జిల్లాలో ఇప్పటికే నర్సరీల ఏర్పాటులో ఆలస్యమైందని వెంటనే అన్ని నర్సరీలలో బ్యా గుల్లో మట్టిని నింపి వారం రోజుల్లో విత్తనాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారులను కలెక్టర్‌ శ్రుతిఓఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో డీఆర్‌డీవో, జెడ్పీ డిప్యూటీ సీఈవో, అటవీశాఖ అధికారులు, డీపీవోతోపాటు మండలాల అధికారులతో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని నర్సరీలు ఏర్పాటు చేశా రు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధం గా డంపింగ్‌యార్డు నిర్మాణం, శ్మశాన వా టిక, ఇంకుడుగుంతల ఏర్పాటుపై మండలా ల వారీగా అధికారులతో మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో నర్సింహులు కలెక్టర్‌కు వివరిస్తూ ప్రతి జీపీలో 10వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని కొత్త నర్సరీలకు ఇంకా ఆరు లక్షల బ్యాగులు అవసరం కాగా ఈ రోజు సాయంత్రం వరకు అందిస్తామని తెలిపారు. స్పందించిన కలెక్టర్‌ ఇప్పటికే చాల ఆలస్యమైందని మూడు రోజుల్లో నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు బ్యాగుల్లో మట్టి నింపి వాటికి కావాల్సిన విత్తనాలు తెప్పించుకోవాలన్నారు. 

   

 ఆ విత్తనాలను ట్రీట్‌మెంట్‌ చేసి వారం రోజుల్లో నాటే విధంగా చూడాల్సిన బాధ్యత సంబంధిత మండల అభివృద్ధి అధికారులదేనని కలెక్టర్‌ ఆదేశించారు. విత్తనాలు ఏవిధంగా ట్రీట్‌మెంట్‌ చే యాలి, ఎలా నాటాలి అనే విషయంలో జి ల్లా అటవీ శాఖ అధికారుల సలహాలు, సూ చనలు తీసుకొని వారి పర్యవేక్షణలో విత్తనాలు వేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారి బాబ్జిరావు మా ట్లాడుతూ తమ సి బ్బంది ద్వారా రెండు, మూడు రోజుల్లో మండలాల వారీగా వనసేవలకు శిక్షణ ఇస్తామని, అధికారులకు అన్ని విధాలా సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. డంపింగ్‌యార్డుల నిర్మాణాలపై మా ట్లాడుతూ ఎక్కడెక్కడ ఇంకా భూమి గుర్తించలేదు, ఇతర సమస్యలు ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని అధికారులకు ఆమె ఆదేశించారు. 

  

తడి, పొడిచెత్త వేరు చేయుటకు షెడ్లు నిర్మించే విధంగా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పల్లెప్రగతిలో చేయాల్సిన అన్ని పనులను ఏ రోజుకు ఆరో జు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె సం బంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ నివేదికకు, మాస్టర్‌ నివేదిక కు పొంతన లేదని దీనిని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని డీపీవో కృష్ణను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు న ర్సింహులు, ముషాయిదాబేగం తదితరులు పా ల్గొన్నారు.


logo