మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 04, 2020 , 23:58:24

ఆదర్శంగా.. పరుమాల

ఆదర్శంగా.. పరుమాల

గద్వాలటౌన్‌ : పరుమాల గ్రామస్తులు వంద రోజుల్లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి జిల్లాలో అందరికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో రా మాలయాన్ని నిర్మించాలని  సంకల్పించి, వందరోజుల్లో సీతారాముల లక్ష్మణ సమేతా ఆలయాన్ని పూర్తిచేయాలని తీర్మానం చేసుకున్నారు. ఇందుకు రాష్ట్ర కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌, పరుమాల  సర్పంచ్‌ పరుమాల నాగరాజు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. నాగరాజు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి వివిధ వర్గాల దాతలు రూ 35లక్షల నుంచి 40లక్షల వరకు విరాళంగా ఇచ్చారు. అలాగే గ్రా మంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న వారు స్వచ్ఛందంగా విరాళంతో పాటు ఆలయ నిర్మాణాంలో కూడా భాగస్వాములయ్యారు. ఆలయ గోపురాన్ని ఒక ముస్లిం నిర్మాణం చే యడం విశేషం. గర్భగుడి మొత్తం కూడా రాతితో నిర్మాణం చేపట్టా రు. అలాగే అద్భుతమైన శిల్పాలను ఆవిష్కరించారు. ఆలయ నిర్మా ణం, శిల్పలాను ఆవిష్కరించడం, గోపుర నిర్మాణం అన్ని కూడా కేవ లం వందరోజుల్లో పూర్తి చేశారు. 


నేటి నుంచి ఉత్సవాలు..

ఆలయ నిర్మాణం పూర్తవడంతో బుధవారం నుంచి శుక్రవారం వరక విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా 5న కళశపూజ,  గణపతిపూజ, నవ గ్రహ ఆవాహన, నాభిశిల, మూల మంత్ర, జయాధి హోమాలు, ల ఘు పూర్ణాహుతి ఉంటుంది. 6న మూలమంత్ర హోమాలు, వాస్తు హోమాలు, ధాన్యాధివాసం, కూష్మాండ పూజలు, గర్త పూజలు ఉం టాయి. 7న సుప్రబాభాత సేవ, వ్యాసహోమాలు, మూల మంత్ర హో మాలు, యంత్ర ప్రతిష్ట, మహా కుంభ బలి, గోదర్శనం, సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉదయం సీతా రాములు, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహల ప్రతిష్టతో పాటు ధ్వజస్థంభ ప్రతిష్ట, నవగ్రహాల ప్రతిష్ట, గణపతి, సుభ్రమణ్యస్వామి విగ్రహాల ప్ర తిష్ట, నాభిశిలా తోరణం, బొడ్రాతి ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. 


గ్రామస్తుల సహకారం మరువలేనిది..

ఆలయ నిర్మాణంలో గ్రామస్తుల సహకారం మరువలేనిదని ఆల య వ్యవస్థాపక అధ్యక్షుడు, సర్పంచు పరుమాల నా గరాజు అన్నారు. ఉత్స వాలకు సంబంధించి కరపత్రాలను పరుమాల గ్రామం లో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీతారామలయ ప్రాం గణంలో మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వంద రోజుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడం దైవ సంకల్పమేనన్నారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌లు ముఖ్య అ తిథులుగా పాల్గొంటారని తెలిపారు. అలాగే కలెక్టర్‌ను ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తె లిపారు.  ఉత్సవాలను పురస్కరించుకుని చెక్క భజన పోటీలను ని ర్వహి స్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో తిరు పతిరెడ్డి, ప్రభాకర్‌, లత్తి పురం వెంకట్రామిరెడ్డి, సుధాకర్‌, విశ్వనాథ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>