ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Feb 03, 2020 , 23:40:39

రిజర్వేషన్లు ఖరారు

రిజర్వేషన్లు ఖరారు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఎన్నికల అధికారులు సహకార సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సహకార శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. సమయం తక్కువగా ఉన్నందున్న అధికారు లందరూ నిరంతరం శ్రమించి ఎన్నికల ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని సూచించారు. ఈ నెల 15న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్‌ ముగిసిన మూడు రోజుల తరువాత చైర్మన్‌ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి అన్ని సింగింల్‌ విండోలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. దీంతో ఆశావాహులు పార్టీ టికెట్ల కోసం నాయకుల ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. 

సహకార సంఘం ఎన్నికల ప్రక్రియ ముందుస్తుగా ప్రకటించిన తేదీల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లు  స్వీకరించాలని తెలిపారు. పోలింగ్‌ సెంటర్లు, బ్యాలెట్‌ బాక్స్‌లు, పోలింగ్‌ సిబ్బందిని ఎక్కడా లోపం లేకుండా నియిమించాలని ఆదేశించారు. తక్కవ సమ యంలో సిబ్బందిని వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. 

నేతల చుట్టూ  ప్రదక్షిణలు

ఎన్నికల అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రక టించడంతో ఆశావాహుల్లో హడావిడి మొదలైంది. అధికార తరుపున పోటీ చేసేందుకు ఆశావాహులు ఆసక్తి చూపు తున్నారు. తమ వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తుండగా పోటీ తీవ్రతరమైంది. టికెట్లు కేటాయించడంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహంలు సమష్టి నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో చర్చించి అందరి అభిప్రాయం తీసుకొని గెలుపు గుర్రాలను ఎంచుకొని టికెట్లు కేటాయిస్తున్నారు. logo