బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 03, 2020 , 23:39:07

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

గద్వాల, నమస్తే తెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిపాలన యంత్రాంగం పారదర్శకత, నిబద్ధతతో పనిచేసే విధంగా చూడడంతోపాటు జిల్లా సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా పరిపాలన అధికారి శ్రుతిఓఝా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో సీటీసీలపై ఆమె సంతకాలు చేసి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గద్వాల జిల్లాకు బదిలీపై రావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శృతిఓఝా ఇదివరకు వరంగల్‌ పురపాలక కార్పొరేషన్‌, గ్రేటర్‌ వరంగల్‌లో కమిషనర్‌గా విధులు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గ్రేటర్‌ హైదరబాద్‌ పురపాలక కార్పొరేషన్‌లో అడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లాకు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులందరి సహకారం కావాలని ఆమె ఆమె ఈ సందర్భంగా తెలిపారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లొచ్చని ఆమె వెల్లడించారు. ప్రతిశాఖ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శృతిఓఝాకు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతోపాటు జిల్లా ఉన్నతాధికారులు తాసిల్దార్‌లు, కలెక్టరేట్‌ సిబ్బంది పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అధికారులు ఇందిర, పుష్పమ్మ, డాక్టర్‌ సునీత, కమలాదేవి, ప్రియాంక, రాములు, సీతారాంనాయక్‌, ఆర్డీవో రాములు తదితరులు ఉన్నారు.

అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్‌, నమస్తే తెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శృతిఓఝాను అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. logo