సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 03, 2020 , 23:37:16

ఆంజనేయస్వామి సన్నిధిలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆంజనేయస్వామి సన్నిధిలో మంత్రి  నిరంజన్‌రెడ్డి

ధరూరు : మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలోని ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారిని సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరితాయాదవ్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పూజారి గోపినాథ్‌ జోషి, ధర్మకర్త గిరిరావు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో మంత్రికి, చైర్‌పర్సన్‌కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, చైర్‌పర్సన్‌ల పేరుతో ప్రత్యేక పూజలు చేసి ప్రధాన అర్చకుడు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విషిష్ఠతను, బ్రహ్మోత్సవాల వైభవం గురించి, మంత్రాలయ పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థల వారు చెప్పిన ప్రవచన పలుకులు,  సారాంశాన్ని చదివి వినిపించారు. అనంతరం మంత్రి ఆలయ పరిసరాలను తిరిగి దుకాణ సముదాయాలను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆలయంలోని వేద పండితులు మంత్రి, చైర్‌సర్సన్‌లను పట్టు శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర పంచాయతీ ట్రిబునల్‌ అధ్యక్షుడు, మాజీ ఉమ్మడి జిల్లా చైర్‌పర్సన్‌ బండారి భాస్కర్‌, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి, మండల తాసిల్దార్‌ అశ్ఫాక్‌ అహ్మద్‌, తిరుపతయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. logo