బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 23:52:47

సహకారానికి సై

సహకారానికి సై

జోగుళాంబ గద్వాల జిల్లాప్రతినిధి, నమ స్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నేడు సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అన్ని జిల్లాలో డిస్ట్రిక్‌ కో -ఆపరేటివ్‌ అధికారులుందరూ ఈ మేరకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఓటర్ల గణన చేపట్టి నూతన ఓటర్లను జతచేసి మరణించిన వారి ఓటర్లను తొలగించే పనిలో పడ్డారు. ఈ ఓట ర్ల సంఖ్య ఆధారంగానే విండోల్లోని వా ర్డుల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లాలో మళ్లీ ఎన్నికల వేడి రగులుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని సహకార సంఘాల్లో గులాబీ జెండాను ఎగరవేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎం అబ్రహంలు పక్కవ్యూహంతో ముం దుకు వెళుతున్నారు.

  • నేడు సహకార ఎన్నికల నోటిఫికేషన్‌
  • మొత్తం ఓటర్లు 59,753 మంది
  • అభ్యర్థుల ఖరారుకోసం సమావేశాలు
  • నేడు రిజర్వేషన్ల ప్రకటన
  • జిల్లాలో 11సింగిల్‌ విండోలు

జోగుళాంబ గద్వాల జిల్లాప్రతినిధి, నమ స్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నేడు సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అన్ని జిల్లాలో డిస్ట్రిక్‌ కో -ఆపరేటివ్‌ అధికారులుందరూ ఈ మేరకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఓటర్ల గణన చేపట్టి నూతన ఓటర్లను జతచేసి మరణించిన వారి ఓటర్లను తొలగించే పనిలో పడ్డారు. ఈ ఓట ర్ల సంఖ్య ఆధారంగానే విండోల్లోని వా ర్డుల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లాలో మళ్లీ ఎన్నికల వేడి రగులుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని సహకార సంఘాల్లో గులాబీ జెండాను ఎగరవేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎం అబ్రహంలు పక్కవ్యూహంతో ముం దుకు వెళుతున్నారు. 

నేడే ఎన్నికల నోటిఫికేషన్‌

ఎన్నికల అధికారులు సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నెల 6 నుంచి 8వరకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 9న స్క్రూట్నీ నిర్వహించి నిబంధనల ప్రకా రం ఆమోదించనున్నారు. నామినేషన్ల ఉసహంసరణకు అభ్యర్థులకు ఫిబ్రవరి 10న అవకాశం కల్పించనున్నారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు నిర్వహించడం లేదు కాబట్టి బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక గుర్తులను కేటాయించనుంది. అనంతరం ఫిబ్రవరి 15న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు కౌంటింగ్‌ చేపట్టి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

సహకార సంఘం ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టారు. గతంలో ఎన్నికలు నిర్వహించినప్పడు 11 సింగిల్‌ విండోలో దాదాపుగా 62 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో మరణించిన వారి ఓట్లను తొలగించి నూతనంగా అర్హత పొందిన ఓటర్లను జతచేస్తున్నారు. ఈ ఓటర్ల ఆధారంగా నేడే అన్ని విండోలలో రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించ నున్నారు. అనంతరంలో పోలింగ్‌ను బ్యాలెట్‌బాక్స్‌ల ద్వారా నిర్వహించ నుండటంతో కావల్సిన పోలింగ్‌ కేంద్రాలను, బ్యాలెట్‌ బాక్స్‌లను ఏర్పాటుచేసే పనిలో పడ్డారు. 

సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు 

టీఆర్‌ఎస్‌ తమ పరంపరను కొనసాగించేందుకు మరో సారి సన్నద్ధమవుతుంది. జిల్లాలోని 11 సహకార సంఘాలపై గు లాబీ జెండాను ఎగరువేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సింగిల్‌ విం డోల వారీగా సమావేశాలు నిర్వహించి పోటీలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌లకు రిజర్వేషన్లు లేకపోవడంతో పోటీ తీవ్రత ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలందరితో సమావేశాలు నిర్వహించి సమిష్టి నిర్ణయంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ఇ ప్పటికే కొన్ని సహకార సం ఘాల చైర్మన్‌  భ్యర్థులను ఖా రారు చేశారు. ఇదే స్థాయిలో అలంపూర్‌ ఎ మ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం కూడా పార్టీ కార్యకర్తలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 

సహకార సంఘం ఓటర్లు సంఖ్య 59753

ఎన్నికల అధికారులు సహ కార సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేశా రు. జిల్లాలోని 11 సింగిల్‌ విండోల పరిధిలో మొత్తం 143865 మంది స భ్యులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. వీరిలో కోఆపరేటివ్‌లో రుణాలను పొందిన సభ్యులను మాత్రమే ఎన్నికల అధికారులు ఓటర్లుగా పరిగణిస్తారు. ఎన్నికల సమయం నాటికి రుణం తీసు కుని కనీసం ఏడాది ముగిసిన సభ్యులకు మాత్రమే ఓటు హక్కును కల్పించారు. గతంలో దాదాపు 62వేల మంది ఓటర్లు ఉండగా తాజాగా మరణించిన వారి ఓ ట్లు తీసివేయగా 59,753 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రక టించారు. 

logo