సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 23:51:09

6 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

6 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

గద్వాల టౌన్‌ : గద్వాల కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 6 నుంచి ప్రారంభమై 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ విచారణకర్త ప్రభాకర్‌, ఆలయ మేనేజర్‌ సంప్రతిమోహన్‌లు వెల్లడించారు. కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌లను వారు ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులైన సుభుదే్రంద తీర్థ శ్రీపాదు ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6న మూలవిరాట్‌కు నిత్య విశేష ఫలపంచామృత అభిషేకంతోపాటు విశేష పుష్పాలంకరణ, పుణ్యహవచనం, సాయంత్రం ఐదున్నర గంటలకు ధ్వజారోహణం, రా త్రి 8 గంటలకు స్వామి వారి హన్మత్‌ వాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు. 7న సీతారాములు కల్యాణం, 8న చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం, అనంతరం గరుఢవాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు. 


9న స్వామివారి మహా రథోత్సవం, 10న శేషవాహన సేవ, 11న చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులు ఊరేగింపు ఉంటుందన్నారు. 12న సత్యనారాయణస్వామి వ్రతం, స్వామి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై పెద్ద అగ్రహారంలోని శ్రీఅహోబిళం మఠం వరకు ఊరేగించడం జరుగుతుందన్నారు. రాత్రి పది గంటలకు నాగవళ్లి దేవతా విసర్జన సర్వ సమర్పణోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు తెలిపారు. అలాగే 11 రాఘవేంద్రస్వామి వారి 12వ వార్షికోత్సవం సందర్భంగా స్థాని క రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రస్వామి అ ష్టాక్షరీ హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. క ల్యాణోత్సవం, రథోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వారు తె లిపారు. ఉత్సవాల ప్రారంభం రోజున మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అలంపుర్‌ తాసిల్దార్‌ మదన్‌మోహన్‌, ఆలయ అర్చకులు శ్రీనివాసరావు, పాంచజన్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo