గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 01:02:52

అభివృద్ధి దిశగా అడుగులు

అభివృద్ధి దిశగా అడుగులు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెల అభివృద్ధే రా ష్ట్ర అభివృద్ధిగా భావించిన సీఎం కేసీఆర్ నూతన పంచాయతీ చట్టాన్ని అమలుపరిచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోనే పల్లెలు గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగాయి. ఏడాది కాలంలో సర్పంచులు అహర్నిశలు కృషి చేసి తమగ్రామాలను అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకుపోవాల ని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2019 ఫిబ్రవరి నెల నుంచి నూతన పంచాయతీ చట్టాన్ని అమలుపరిచారు. ఈ చట్ట ప్రకారం ఏడాది కాలంలోగా  జి ల్లాలో కొలువుదీరిన 255మంది సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 

ఏడాదిలో గ్రామాలకు రూ.88,43,71,200 నిధులు

 గతేడాది ఫిబ్రవరి 2న పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు ప్రభుత్వం మార్చి నెల నుంచి గ్రామాలకు నిధులను అందించింది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక ప్రణాళిక ఎఫ్‌ఎఫ్‌సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ ద్వారా మొ త్తం రూ.88,43,71,200 నిధులను గ్రామాలకు కేటాయించింది. కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌సీ ద్వారా 2019 మార్చిలో రూ.12,48,84,600, సెప్టెంబర్‌లో రూ. 4,84,29,000, అక్టోబర్‌లో రూ.48,41,13,900, నవంబర్‌లో రూ. 7,57,61,600, జనవరిలో రూ. 48,11,3,900 నిధులను మొత్తం రూ.73,77,16,900 అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ ద్వారా  2019 సెప్టెంబర్‌లో రూ.32,44,500, అక్టోబర్‌లో రూ. 32,23,400, నవంబర్‌లో రూ.45,86,300, డిసెంబర్‌లో రూ.7,62,20,100, జనవరిలో  రూ. 3,01,79,500  మొత్తం రూ.14,66, 54,300  నిధులను అందించారు.

పల్లె ప్రగతితో

 గ్రామాల్లో మార్పు 

గతంలో ఏ ప్రభుత్వం పల్లెలలో అమలు పరచని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ పల్లెప్రగతి ద్వారా అమలుపరిచారు. దశాబ్దాల కాలంగా పల్లెలలో పేరుకుపోయిన సమస్యలను రెండు విడుతల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కారం చూపించి పల్లెల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశారు.  గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం, చెత్తాచెదారాన్ని తొలగించడం, శిథిలావస్థకు చేరుకున్న, పాడుబడిన భవనాలను కూ ల్చివేసి పరిసరాలను శుభ్రం చేయడంవంటి కార్యక్ర మాలు చేపట్టారు.  హరితహారం కార్యక్రమం చేపట్టి వీధుల్లో రహదారుల వెం ట, ఇంటి ఆవరణలో వీధుల్లో ఉద్యమం లా  మొక్కలను నా టారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేసి గ్రామాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టారు. పబ్లిక్ న ల్లా, బోరింగుల దగ్గర ఇంకుడు గుంతల ను ఏర్పాటు చేసి నీరు వృథాకానివ్వకుం డా చర్యలు చేపట్టారు.  పవర్‌వీక్ పేరు తో విద్యుత్‌శాఖ అధి కారులు విద్యు త్ మరమ్మతులను చేపట్టారు. కరెంట్ వైర్ల ను, స్థంభాలను సరిచేయడం, విద్యు త్ దీపాలు అమర్చి గ్రామాల్లో విద్యుత్ స మస్యలు లేకుండా  చర్యలు చేపట్టారు. 

ప్రతి పంచాయతీకి ట్రాక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 255 జీపీల్లో ఇప్పటి వరకు 135 ట్రాకర్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటితో పాటు గడిచిన ఏడాదిలో అధికారులు సర్పంచుల కృషితో 100శాతం మరుగుదొడ్లను ని ర్మించి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దారు. వీటితో పా టు చాలా వరకు గ్రామాలలో వర్షం నీ టిని నల్లా నీళ్లను వృథాగా పోనివ్వకుం డా ఇంకుగుంతలను కూడా ఏర్పాటు చేశారు. 


logo