బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 00:56:24

సంప్రదాయాలకు నెలవు నడిగడ్డ

సంప్రదాయాలకు నెలవు నడిగడ్డ

అయిజ రూరల్ : గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకే జాతరలు, ఉత్సవాల్లో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం స్పష్టం చేశారు. మండల పరిధిలోని టీటీదొడ్డి గ్రామంలో గుండ్లభీమరాయుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బండలాగు పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమన్నారు. బండలాగు పోటీలు నిర్వహించడం వల్ల రైతుల్లో పశుసంపదను పెంచాలన్నా తాపత్రయం మరింత పెరుగుతుందన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని భూములన్నీ సస్యశ్యామలం చేసేందుకే ప్రభుత్వం తుమ్మిళ్ల లిప్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈపథకం ద్వారా ఆర్డీఎస్ కాలువకు లింక్ చేసి రాజోలి, వడ్డేపల్లి, మానపాడు, అలంపూర్ మండలాల ఆయకట్టు భూములకు నీరందింస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆర్డీఎస్ కాలువ 12వ డిస్టిబ్యూటరీ నుంచి తెలంగాణ ప్రారంభమవుతుందని, పైభాగంలోని ఆయకటు ్టరైతులను ఆదుకునేందు కోసం చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు నీటిని అందించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్‌కు లింక్ కెనాల్ ఏర్పాటుచేస్తే నడిగడ్డ పూర్తిస్థాయిలో సస్యశ్యామలమవుతుందన్నారు. అనంతరం రైతుసంబురాలకు హాజరైన రై తులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, సర్పంచ్ మహేశ్వరి, ఎంపీటీసీ నిర్మల, టీఆర్‌ఎస్ నాయకులు శివకుమార్, ఉమేశ్‌గౌడ్, వెంకటేశ్, ఎద్దుల రాముడు, డీలర్ రాముడు, సురేంద్రస్వామి, రవిరెడ్డి, చిన్నహనుమంతు, నర్సింహారెడ్డి, ప్రహ్లాదరెడ్డి, మేకల నాగిరెడ్డి, గోపాలకృష్ణయాదవ్, శ్రీధర్, నతనీల్ పాల్గొన్నారు.logo