సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 00:55:52

ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: రోడ్డుపై తిరి గే ప్రతి వాహనదారుడు మోటర్ వా హన చట్టంలోని నియమ నిబంధనలు పాటించాలని అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ని ర్వహించిన ర్యాలీని ట్రైనీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీ ట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎ క్కించడం, వాహనాలను అతివేగంతో నడపడం చేయరాదని సూచించారు. వా హనదారులు తాము నిబంధనలు పాటి స్తూ ఇతరులకు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రంలోని కేకే గార్డెన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి డీటీవో పురుషోత్తంరెడ్డి అధ్యక్షత వహించగా ఏఎస్పీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు విద్యార్థి దశ నుంచే మోటారు వాహన చట్టంలోని నియమ నిబంధనలు నేర్చుకునేలా పాఠశాల యాజమాన్యాలు ప్రోత్సహించాలన్నారు. 18 ఏండ్లు నిండకుండా వాహనాలు నడిపితే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టడం జరుగుతుందని ఏఎస్పీ హెచ్చరించారు. పిల్ల లు చేసి న ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డీటీవో మాట్లాడుతూ తల్లిదండ్రులు త మ పిల్లలకు చిన్నతనం నుంచే రోడ్డు నియమా లు నేర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం మోటర్ వాహన చ ట్టంపై పాఠశాలలో అవగాహన కల్పించాలన్నారు. జనవరి 27 నుంచి రోడ్డు భద్ర తా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేం ద్రంతోపాటు అన్ని పురపాలక సంఘాలు, మండల కేంద్రాల్లో అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక మీదట నిబంధనలు పా టించని వారిపై జిల్లా పోలీస్‌శాఖ సహకారంతో భారీగా జరిమానాలు విధించ డం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేసినట్లు డీ టీవో తెలిపారు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు గా పనిచేస్తూ ప్రమాదాలు చేయని వారికి డీటీవో, ఏఎస్పీలు శాలు వా, మెమొంటోలతో సత్కరించారు. స మావేశంలో ఆర్టీసీ డీఎం రామ్మోహన్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హన్మంతు, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు చక్రవర్తిగౌడ్, రవీందర్, శంకర్‌నారాయణ, మల్లికార్జునరెడ్డి, మోహన్, నర్సింహ, వీరస్వామి, శ్రీలతారెడ్డి, రాధిక, ఎస్సైలు సత్యనారాయణ, రాజు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు   తదితరులు పాల్గొన్నారు. 


logo