శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 00:47:26

మహిళా సంఘాల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయండి

మహిళా సంఘాల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయండి

మల్దకల్ : మండలంలోని అన్ని గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యుల వివరాలతోపాటు వారి రుణాల వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయాలని జిల్లా అధికారి భీంసేన్ సీసీలను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సీసీలు, వీవోఏలు, ఏపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వీవోఏలు ప్రతి సంఘం సభ్యులకు నెలకు రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రిజిస్టర్లలోనూ సమావేశాల వివరాలను, బ్యాంకు లీంకేజీ వివరాలను కూడా పొందుపర్చాలన్నారు. ప్రతి నెల సంఘ సభ్యులు రుణాలు రెన్యూవల్ చేస్తున్నారా లేదా అనే విషయాలను కూడా కంప్యూటర్‌లో నమోదుచేయాలన్నారు. పనిచేయని వీవోఏలపై చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంకా బ్యాంకు రుణాలు పొందని సంఘాలు ఉంటే మార్చి వరకు పూర్తి చేయాలన్నారు. స్త్రీ నిధి రుణాలు ఇప్పించి సంఘాల సభ్యులు లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు జయన్న, రవి, మద్దిలేటి, రాజుతోపాటు వివిధ గ్రామాలకు చెందిన వీవోఏలు పాల్గొన్నారు.logo