శనివారం 28 మార్చి 2020
Gadwal - Feb 01, 2020 , 00:49:34

శునకమా..ఉరుకుమా!

శునకమా..ఉరుకుమా!
  • ఉత్తనూరులో కుక్కలకు పరుగుపందెం
  • వీక్షించేందుకు భాదరీగా తరలొచ్చిన జనం
  • కర్ణాటక, మహరాష్ట్ర నుంచి 22కుక్కలు

అయిజ : మండలంలోని ఉత్తనూరు గ్రామంలో శునకాలకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం కుక్కలకు పరుగు పందెం పోటీలు ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 22 కుక్కలను పోటీలకు తీసుకొచ్చారు. పోటీల్లో బొమ్మను నోట కర్చుకునేందుకు కుక్కలు పోటీపడ్డాయి. ఏ కుక్క నిర్దేశిత ప్రాంతాన్ని దాటి బొమ్మను పట్టుకుందో విజేతగా ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే కొన్ని కుక్కలు ప్రతిభ కనబర్చాయి. చివరకు పోటీలకు వచ్చిన కుక్కల యజమానులకు నగదు బహుమతిని అందజేశారు. మొదటి బహుమతి రూ.15వేలు, ద్వితీయ రూ. 10వేలు, తృతీయ రూ. 5వేలు, నాలుగో బహుమతి రూ. 3వేలు ప్రకటించారు. పోటీల్లో శునకాలు సరిగా ప్రదర్శించకపోవడంతో ప్రతి శునకం యజమానికి రూ.3వేల చొప్పున అందజేశారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలొచ్చారు. 


logo