శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 01, 2020 , 00:47:48

డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం

డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం

గద్వాల అర్బన్‌ : ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలుగుతామని జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు రహదారి 31వ వార్సికోత్సవాలను పురస్కరించుకొని వాహన డ్రైవర్‌లకు డాక్టర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 150 మంది వాహన డ్రైవర్‌లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు డాక్టర్‌మోహన్‌ రావు నిర్వహించారు. షుగర్‌, బీపీ తదితర రోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వాహన డ్రైవర్‌ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాహనాన్ని నడుపగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెలకు ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ చక్రవర్తిగౌడ్‌, ఎంవీఐ  పెద్దయ్య, నాగేశ్వర్‌ రావు, విద్యాసాగర్‌ రెడ్డి, అశోక్‌ కుమార్‌, సోహెల్‌ తదితరులు ఉన్నారు. 


logo