బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 01, 2020 , 00:46:50

మార్చి 1 వరకు గాలికుంటు టీకాలు

మార్చి 1 వరకు గాలికుంటు టీకాలు

గద్వాల టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న పశువులకు గాలికుంటు టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్యకేశవులు, సహాయ సంచాలకులు సురేఖ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పుశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు కొనసాగుతుందన్నారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 49ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టీకాలు వేసిన ప్రతి పశువుకు బార్‌కోడ్‌ ఉన్న ట్యాగ్‌ను వేయడం జరుగుతుందన్నారు. అలాగే హెల్త్‌ కార్డులు కూడా జారీ చేయనున్నట్లు వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 76,332 ఆవులు, 59,121 బర్రెలు ఉన్నాయని వారు ఈ సందర్భంగా వివరించారు. మొత్తం 1,35,453 పశువులు ఉండగా వాటిలో 35,000 వేల పశువులకు ట్యాగ్‌లు వేయడం జరిగిందని మిగతా వాటికి త్వరలోనే ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.


logo
>>>>>>