గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 31, 2020 , 02:00:34

మోగిన నగారా..

మోగిన నగారా..
  • విడుదలైన నోటిఫికేషన్‌
  • అమ్ములు సర్దుకుంటున్న ఆశావహులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 62 వేల మంది సభ్యులు
  • 15 విండోల పరిధిలో ఎన్నికలు
  • గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

అయిజ : జిల్లాలోని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. గత రెండేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు, పం చాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్ని కలు, మున్సిపల్‌ ఎన్నికలు ఒకదాని వెం ట ఒకటి నిర్వహించడంతో సమయం లేక ఎన్నికలను వాయిదా వేసింది. పీ ఏసీసీఎస్‌లకు గడువును పొడ గించక పోవడంతో పాలక మండళ్ల ఎన్ని కలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసు కోవడం తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుం ది. గతంలోని పాత సంఘాలకు మాత్ర మే ఎన్నికలు నిర్వహించేందుకు సర్కా రు నిర్ణయం తీసుకుంది. జిల్లా లోని 11 సంఘాలకు వచ్చే నెల 15న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపట్టింది. ఫిబ్ర వరి 3న సహ కార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. వచ్చే నెల 15న ఉదయం 7 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, 2 గంటలకు కౌం టింగ్‌ నిర్వహించి ఫలితాలను ప్రకటించను న్నారు.


 జిల్లాలో 11 సహకార సంఘాలు 

జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 62 వేల మంది ఓటర్లు ఉండగా, లక్ష 20 వేల మంది రైతులు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు. జిల్లాలో గద్వాల పరిధిలో గద్వాల, ధరూర్‌, గట్టు, మల్దకల్‌, అయిజ, అలంపూర్‌ పరిధిలో అలంపూర్‌, పుటాన్‌దొడ్డి, మానవపాడు, వడ్డెపల్లి, కలుగొట్ల, క్యాతూర్‌లలో పీఏసీఎస్‌లు ఉన్నాయి. 2013, జనవరి 31న ఎన్నికలు జరిగాయి. ఈ పాలక వర్గాలకు పదవీ కాలం పూర్తి కావడంతో ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉం చుకుని రెండేళ్ల పాటు పొడగింపునిచ్చింది దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి వినూత్నమైన పథకాలు చేపడుతుండటంతో పీఏసీసీఎస్‌ పాలకవర్గాలు కొనసాగాలనే ఉద్ద్యేశంతో గడవును పొడగించింది.


పీఏసీసీఎస్‌ ద్వారా రైతులకు తోడ్పాటు ..

జిల్లాలోని పీఏసీసీఎస్‌ల ద్వారా రైతులకు సేవలను విస్తృత పరుస్తుంది సర్కార్‌. రైతులకు స్వల్పకాలిక, ధీర్ఘకాలి క రుణాల పంపిణీకే పరిమితమైన సహకార సంఘాలను తెలంగాణ ప్రభు త్వం పలు రకాల సేవలను అందించి తోడ్పాటునందిస్తుంది. వానాకాలం, యాసంగిలలో విత్తనాలు, ఎరువులతో పాటు మ ద్దతు ధర కల్పిస్తూ పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాల రుణాలను సైతం అందిస్తున్నాయి. రైతులకు పంట రు ణాలు అందించడంతోపాటు కోట్లాది రూపాయల ధాన్యాన్ని కొను గోలు చేస్తున్నాయి. ప్రధానంగా కందులు, మొక్కజొన్న, వరి, శనగ పంటలకు మద్దతు ధర కల్పించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.


logo
>>>>>>