మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 31, 2020 , 01:55:36

రమణీయంగా రథోత్సవం

రమణీయంగా రథోత్సవం

అయిజ : భక్తుల గోవింద నామస్మరణల నడుమ రథంపై ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆసీనులై భక్తులను ఆశీర్వదించా రు. ఉత్తనూరులో బ్రహ్మోత్సవాల్లో భా గంగా గురువారం తెల్లవారు జామున 12.30 గంటలకు రంగు రంగుల పూల తో సర్వాంగ సుందరంగా అలంకరించి న రథోత్సవంపై శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఊరేగారు. టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రథోత్సవంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షులు రాముడు, సర్పంచ్‌ సుదర్శనమ్మ, మాజీ ఎంపీపీ సుందర్‌రా జు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిల ర్లు, దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకు లు, టీఆర్‌ఎస్‌ నేతలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. 


వైభవంగా గజవాహనసేవ..

ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధన్వంతరి వేంకటేశ్వ రస్వామికి గజవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి బిందెసేవ, పంచామృతం, పల్లకీసేవ ని ర్వహించిన అర్చకులు రాత్రి గజవాహన సేవను కమనీయంగా జరిపించారు. 


కనుల పండువగా శేషవాహనసేవ 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేషవాహనసేవ కనుల పండువగా ని ర్వహించారు. శ్రీదే వి , భూదేవి, వేంకటే శ్వ రస్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై ఆశీనులను చేసి పురవీధుల గుం డా ఊరేగింపు నిర్వహించారు. logo
>>>>>>