మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 31, 2020 , 01:45:25

భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలి

భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలి

అయిజ : ప్రస్తుతం సైన్స్‌కు అత్యధిక ప్రా ధాన్యత ఉందని  విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయాలనే సంకల్పంతో దాతల సహకారంతో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం గర్వకారణమని, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని శిక్షణ కలెక్టర్‌ శ్రీహర్ష అన్నా రు. గురువారం మండలంలోని ఉత్తనూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శిక్షణ కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, గ్రంథా లయం, కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌకర్యాల ఏర్పా టు గురించి మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పిస్తే ఉన్నత విద్యలో పేదింటి విద్యార్థులు రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం అటల్‌ టింక రింగ్‌ ల్యాబ్‌లో తయారు చేసిన ప్రయోగాలపై వివరించారు. విద్య కోసం ఎంత ఖర్చైనా భరిం చి సౌకర్యాలను కల్పిస్తామని మాజీ ఎం పీపీ తిరుమల్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు శిక్షణ కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుదర్శన మ్మ, ఎంపీడీవో రమణారావు, ఎంపీవో నర్సింహా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 


logo
>>>>>>