శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 30, 2020 , 00:28:49

అట్టహోసంగా...

అట్టహోసంగా...
  • ఉత్తనూరులో అంతర్రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ప్రారంభం
  • మూడు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన 18 జతల వృషభరాజములు
  • వైభవంగా ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు

అయిజ : తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు నడిగడ్డ అని, అలాంటి నడిగడ్డలో పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం సంప్రదాయమని పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాముడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు అన్నారు. మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా అఖిల భారత ఒంగోలు గోజాతి పో షక, ప్రోత్సాహక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో బుధవారం అంతర్‌ రాష్ట్ర నాలుగు పళ్ల పశుబల ప్రదర్శన పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పశుబల ప్రదర్శనలకు ఉత్తనూరు ప్రత్యేకమన్నారు.  ఉత్తనూరులో జరుగుతున్న పోటీలకు తెలంగాణ, ఆం ధ్ర ప్రదేశ్‌, కర్నాటక రాష్ర్టాల నుంచి 18 జ తల వృషభరాజములు  తరలివచ్చాయి. 


విజేతలకు బహుమతుల ప్రధానం

 ఉత్తనూరులోని ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన నా లుగు పళ్ల విభాగం పశుబల ప్రదర్శనలో విజేతలు.. కడప జిల్లా, వల్లూరు మండలం, పెద్ద పుత్త గ్రామానికి చెందిన ఎద్దుల రెడ్డి గారి పుత్త వెంకటసుబ్బారెడ్డి వృష భ రా జములు 5,700 అడుగుల దూరం లా గి మొదటి స్థానంలో నిలువగా, గద్వాల జిల్లా, గట్టు మండలం, ఇందువాసికి చెందిన రమేశ్‌ వృష భరాజములు 5,5 86.6 అడుగుల దూరంలాగి రెండో స్థా నంలో నిలిచాయి. నారాయణపేట జి ల్లా, నర్వ మండలం, లంకాలకు చెం దిన రాములు వృషభరాజములు 5,43 4.9 అడుగుల దూరం లాగి మూడో స్థానంలోనిలువగా, కర్ణాటక రాష్ట్రం, రాయచూర్‌ జిల్లా, ఫలకమ్‌ దొడ్డికి చెందిన ఖాజాహుస్సేన్‌ వృషభరాజములు 5,359.7 అడుగుల దూరం లాగి నా లుగో స్థానంలో నిలిచాయి. 


నాగర్‌కర్నూల్‌ జిల్లా, పాగుంటపురానికి చెందిన శాంపుల చరణ్‌ తేజ, గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం, చాగాపురానికి చెందిన చక్రవర్తి గౌడ్‌కు చెందిన కంబైన్డ్‌ ఎద్దుల జత 5,322.9 అడుగుల దూరం లాగి ఐదోస్థా నంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.  విజేతలుగా నిలిచిన ఎద్దులకు పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాముడు నగదు బహుమతులను అందజేశారు. మొదటి బహుమ తి రూ. 30వేలు, రెండో బహుమతి రూ. 20వేలు,  మూడో బ హుమ తి రూ. 15వేలు, నా లుగో బ హుమతి రూ. 10వేలు, ఐదో బహుమతి రూ.10 వేల నగదు అందజేశారు. 


ధన్వంతరి వేంకటేశ్వరస్వామికి పూజలు

 ఉత్తనూరులోని ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయంలోని స్వామివారి  ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూల విగ్రహానికి అభిషేకం, అలంకరణ చేశారు. ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తా బు చేశారు. అలాగే మండలంలోని టీటీదొడ్డిలో ని గుండ్ల భీమరాయుడు ఉత్సవాలు కనుల పండువ గా జరుగుతున్నాయి.  ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, సర్ప ంచ్‌లు, ఎంపీటీసీలు, కౌ న్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo