శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 30, 2020 , 00:27:07

ప్రజా రక్షణకే కార్డన్‌ సెర్చ్‌

ప్రజా రక్షణకే కార్డన్‌ సెర్చ్‌

కేటీదొడ్డి : ప్రజల సురక్షితంకోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ కృష్ణ సూచించారు. మం డలంలో బుధవారం ఉదయం 4గంటల నుంచి 7 గం టల వరకు  ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేర కు పోలీసులు కార్డన్‌  సెర్చ్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా మండల కేంద్రంలో సీఐ హన్మంతు ఆధ్వర్యం లో మొత్తం ఇళ్లను సోదా చేయగా ఈ సోదాలలో ఎ లాంటి ధ్రువ పత్రాలు లేని 29 బైకులు సీజ్‌ చేశామని, అలాగే రోడ్డు నిబంధనలు పాటించని 15 బులెరో వా హనాలు, 18 ట్రాక్టర్లకు అక్కడే రేడియం స్టిక్కర్లను య జమానులచే తమ వాహనాలకు అంటించినట్లు సీఐ హన్మంతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కృష్ణ మాట్లాడుతూ.. కొందరు అనవసరంగా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారని దానిని మనం పా జిటీవ్‌గా తీసుకుని ముందుకెళ్తే మంచి భవిష్యత్‌ ఉం టుందన్నారు. ప్రజలు సురక్షితంగా జీవించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. గుట్కా, మట్కా, జూదం లాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు దోచు కునే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా మండ లంలో కార్డన్‌  సెర్చ్‌ నిర్వహించిన అనంతరం వాహన దారులకు  ట్రాఫిక్‌ నియమాలపై ఏఎస్పీ పలు సూ చ నలు చేశారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనల గురించి  అవగాహన నిర్వహిస్తున్నామని అయినప్ప టికి ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు గురవుతు న్నారన్నారు. పోలీసులు చెబుతున్న ప్రతి మాట విని డ్రెవింగ్‌ చేస్తే ఏలాంటి ప్రమాదాలు జరగవని ఆయన ప్రజలకు సూచించారు.logo