శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 30, 2020 , 00:26:35

ఎరువుల క్రయ విక్రయాలు

ఎరువుల క్రయ విక్రయాలు
  • ఈ-పాస్‌ విధానంలో జరగాలి

గద్వాల,నమస్తేతెలంగాణ:  జిల్లాలోని ఎరువుల డీలర్లు అందరూ తమ క్రయ విక్రయాలను ఈ-పాస్‌ యంత్రాల ద్వారానే కొనసాగించాలని అలా కొనసాగించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయ ఏడీఏ మధుమోహన్‌ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో ఎరువుల అమ్మకాలు, కొనుగోలుపై జిల్లాలోని డీలర్లు, హోల్‌సేల్‌డీలర్లు, మార్క్‌ఫెడ్‌ అధికారులు, కంపెనీ ప్రతినిధులు, పీఏసీఎస్‌ అధికారులకు ఈ-పాస్‌ విధానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై మధుమోహన్‌ వారికి ఎరువుల క్రయ, విక్రయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల నిల్వలు ఎప్పటి కప్పుడు సరిగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మిన, రైతులకు ఎరువుల కొరతలు సృష్టించిన అటు వంటి వారిపై వ్యవసాయశాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీలర్లు రైతులకు ఎరువులు విక్రయించే క్రమంలో తప్పని సరిగా వారివివరాలు నమోదు చేసుకోవడంతో పాటు ఈ-పాస్‌లోనే విక్రయించాలని చెప్పారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో బిల్లులతో పాటు ఆధార్‌ తప్పనిసరిగా తీసుకుని రావాలని, ప్రతి ఎరువుల దుకాణం వద్ద తప్పని సరిగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. డీలర్లు ఎవరైనా రైతులకు కల్తీ ఎరువులు విక్రయిస్తే అవసరమైతే వారి డీలర్‌ షిప్‌ రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ నాయక్‌, ఏడీఏలు సక్రియనాయక్‌, వ్యవసాయఅధికారులు జనార్ధన్‌ మార్క్‌ ఫెడ్‌ అధికారి హన్మంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo