గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 29, 2020 , 00:43:13

పారదర్శకంగా పల్లెప్రగతి పనులు

పారదర్శకంగా పల్లెప్రగతి పనులు

అయిజ రూరల్‌ : గ్రామాల అభివృద్ధి కోసం చేపడుతు న్న పల్లెప్రగతి పనులు పారదర్శకంగా జరగాలని, ఇం దులో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని రాష్ట్ర స్పెషల్‌ స్కాడ్‌ టీమ్‌ సభ్యులు అడిషినల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ సూచించారు. మండల పరిధిలోని సంకాపు రం, ఉప్పల క్యాంప్‌ గ్రామాలను ఆయన మంగళవా రం సందర్శించి జీపీ కార్యాలయం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. 


అనంతరం పాఠశాలలోని వసతులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుక్నునారు. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల స్థితిగతులను తెలుసుకున్నారు. తదనంతరం గ్రామ శివారు లో ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డు ను, వైకుంఠధామంలో కొనసాగుతున్న క్రిమిటోరియం పనులను ఆయన పరిశీలించి పనులు నాణ్యతా ప్రమాణాల తో జరపాలని అధికారులకు అదేశించా రు. నర్సరీని పరిశీలించి నిర్వాహకుల కు పలు సూచనలు చేశారు. ప్రతి నర్సరీలో ముప్పైవేల మొక్కలు నాటి గ్రా మాలను హరితమయం చేయాలని ఆ యన సూచించారు. పల్లెప్రగతి పనుల పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట అడిషినల్‌ ఎస్పీ కృష్ణ, డీ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ సుజాత, సింగిల్‌ విండోచైర్మన్‌ రాముడు, ఎంపీడీవో రమణారావు, పంచాయతీ కార్యదర్శి పరుషరాము లు, ఉప సర్పంచ్‌ ఈశ్వర్‌, ఉపాధి సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

పోలీసుల గౌరవ వందనం 

స్వీకరణ

అయిజ : ప్రజలకు మెరుగైన సేవలను అందించి వారి అభిమానం చూరగొనాలని సీఐడీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ గోవింద్‌సింగ్‌ పేర్కొన్నారు. ఉప్పల క్యాంప్‌, సంకాపురం గ్రామాల పర్యటనలో భాగంగా ఆయన అయిజ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో మంగళవా రం జిల్లా పోలీసుల నుంచి గౌరవ వం దనం స్వీకరించారు. ఈ సందర్భంగా గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ కింది స్థాయి పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రజలను ఆప్యాయంగా చూడాలన్నారు. కార్యక్రమంలో శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రమణారావు, సూపరిండెంట్‌ సాయిప్రకాశ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాముడు, ఎస్సై జగదీశ్వర్‌, సర్పంచ్‌ సుజాత, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo
>>>>>>