బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 29, 2020 , 00:33:22

పల్లెప్రగతి పనులు నాణ్యతతో చేపట్టాలి

పల్లెప్రగతి పనులు నాణ్యతతో చేపట్టాలి

ధరూరు: మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ యూసీ మెరు జెడ్పీ సీఈవో మషాయిదాబేగంతో కలిసి బూరెడ్డిపల్లి, దొర్నాల గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో కాలినడకన పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రతను, అంగన్‌వాడీ కేంద్రాలలు, పాఠశాలలు, నర్సరీలను, డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామ స్థల ఏర్పాట్లను పరీశీలించారు. దొర్నాల జీపీలో గల నర్సరీని సందర్శించి నర్సరీ నిర్వహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం బూరెడ్డిపల్లి జీపీలోని నర్సరీ, డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామ స్థల చదును పనులను పరీశీలించారు. పర్యవేక్షణ అనంతరం జీపీ భవనంలో అధికారులతో సమావేశమై పారిశుధ్యం, వైకుంఠధామ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో, అబ్దుల్‌ జబ్బార్‌, సర్పంచ్‌లు బండ్లజ్యోతి, మహెబూబ్‌, ఏపీవో పాగుంటస్వామి, ఎంపీవో కృష్ణమోహన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


logo
>>>>>>