బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 29, 2020 , 00:29:49

కోదండాపూర్‌ గ్రామ కార్యదర్శి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు షోకాజ్‌ నోటీసులు..

కోదండాపూర్‌ గ్రామ కార్యదర్శి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు   షోకాజ్‌ నోటీసులు..

ఇటిక్యాల/ఎర్రవల్లి చౌరస్తా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 2020-21 ఏడాదికి సంబంధించి ‘మన గ్రామం మన నర్సరీ’ ఏర్పాటు పనులను ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోదండాపూర్‌, ధర్మవరం గ్రామాల నర్సరీల ఏర్పాటులో పురోగతి కనిపించకపోవడంతో గ్రామ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకొని పనిచేయకపోతే కఠినచర్యలు ఉం టాయన్నారు. గ్రామానికో కార్యదర్శి ఉన్నా నర్సరీల ఏర్పాటులో అలసత్వం ఏందుకు ప్రదర్శిస్తున్నారని ఆమె వారిని ప్రశ్నించారు. మండలంలో పనులను పర్యవేక్షించాల్సిన ఏపీవో జయలలిత నిర్లక్ష్యంపై ఆమె మండిపడ్డారు. సిబ్బందిని సరైన మానిటరింగ్‌ చేయడంలో ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి విఫలమయ్యారని ఇన్‌చార్జి కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మండల ప్ర జాపరిషత్‌ కార్యాలయములో గ్రామ కార్యదర్శులు ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీల ఏర్పాటులో పొంతనలేని స మాధాలు చెప్పిన గ్రామకార్యదర్శులు, ఉపాధిసిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్య క్తం చేశారు. ఈనెల 31 లోగా 29 జీపీ ల్లో నర్సరీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ప్రతి నర్సరీకి 20 గుంటల భూ మి కచ్చితంగా ఉండాలన్నారు. అలాగే ఎంపిక చేయబడ్డ భూమికి చుట్టూ కంచె ఏర్పాటు, నీటివసతి ఉండాలన్నారు. హరితహారం నర్సరీల ఏర్పాటులో అలసత్వం వహించిన కోదండాపూర్‌ గ్రామకార్యదర్శి, క్షేత్రసహాయకురాలికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష, తాసిల్దార్‌ మల్లికార్జున్‌, డీపీవో కృష్ణ, గ్రామ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.


logo