బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 28, 2020 , 03:44:21

రోడ్డు భద్రత మనందరి బాధ్యత

రోడ్డు భద్రత మనందరి బాధ్యత

మహబూబ్‌నగర్‌ క్రైం : జాతీయ, రాష్ట్ర రహదారిపై నిత్యం ప్రతి రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్ర మాదాలలో గాయాలపాలై ప్రాణాలను కోల్పుతున్నా వారి సంఖ్య పెరుగుతుంది. మీతి మిరిన వేగం దీనికి తోడు సూచికలు పాటించక పోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం కారణం ఏదైనా ప్రమాదాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. కనీసం ప్రమాదం నుంచి బయట పడేందుకు కార్లలో సీటు బెల్టు పెట్టుకోకపోవడం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రమాదాల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుంది. పోలీస్‌స్టేషన్‌ దాకా కొన్ని వచ్చినప్పటికి మరికొన్ని కేసులు కాకుండానే వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రమాదాలోల ఎక్కువ శాతం యువత ఉంటున్నట్లు పోలీసు అధికారుల పరిశీలనలో తేలింది. ఉమ్మడి జిల్లాలో సైతం ఇదే తరహ ప్రమాదాలు చోట్టు చేసుకుంటున్నాయి. రోడ్డు మీదికి వెళితే క్షేమంగా తిరిగి వస్తామా?లేదా ? అనే భయం వెంటాడుతోంది. అంతగా రహదారి ఆ భద్రత పెరిగిపోయింది. మనం జాగ్రత్తగా ఉన్నా అవతలి వాళ్లు వచ్చి ఢికోడితే...! జిల్లాలో ఏటా 500  మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. 2 వేలకు మందికి పైగా గాయపడుతున్నారు. ఇవన్ని మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవే... 

ఇవి కారణాలు

మీతిమిరిన వేగం

 జిల్లాలోని జాతీయ రహదారిపై కార్లు 100, ద్విచక్రవాహనాలు, బస్సులు, లారీలు 80 కీ.మీ.ల వేగంతో రహదారులలో వెళాల్సి ఉండగా మీతిమిరిన వేగంతో ప్రయాణం చేస్తున్నారు. అతివేగంతోనే వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. 

నిబంధనలు పాటించకపోవడం 

 వాహనాలు నడిపే సమయంలో వాహనదారులు నిబంధనలు పట్టించుకోవడం లేదు. కార్లు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకకోపోవడం తో ప్రమాదం జరిగిన సమయంలో బెలున్లూ తెరుచుకోకపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువై ప్రాణాలకే ప్రమాదం తెస్తోంది. ద్విచక్రవాహదారులు సైతం హెల్మెట్‌ ధరించకపోవడంతో ప్రమాదం జరిగితే తలకు గాయమై మృతి చెందుతున్న వారు ఆధికంగా ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన వాహనాన్ని అదుపులో చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. 

అధికారులు దృష్టి పెట్టండి

 ఉమ్మడి జిల్లాలో అలంపూర్‌, అడ్డాకుల సమీపంలో జాతీయ రహదారిపై లారీల పార్కింగ్‌ కోసం అధికారులు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. అయితే అక్కడ కనీస వసుతులు లేకపోవడం, తినడానికి దాబాలు, మూత్ర శాలలు లేకపోవడంతో లారీలు అక్కడ నిలుపడం లేదు. రహదారులు పక్కన నిలుపుతున్నారు. రాత్రిళ్లు వీటిని గమనించక  వాహనదారులు వెనకాల నుంచి ఢీకొట్టి మృతువాత పడుతున్నారు. 

 జాతీయ రహదారి పొడువునా

 డేంజర్‌ జోన్స్‌ 

 జాతీయ రహదారి పొడువున్నా జిల్లాలో 213 కిలో మీటర్‌ మేరా ఉండడంతో జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను ఆర్టీఏ, పోలీసు అధికారులు గుర్తించారు. వాటిలో తిమ్మాపూర్‌ ఎక్స్‌ రోడ్‌, ఆశన్న దాబా, తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్‌, షాద్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, రాయికల్‌, బాలనగర్‌, బాలనగర్‌ బ్రిడ్జి వద్ద, రాజాపూర్‌, ముద్దిరెడ్డి పల్లి, గొల్లపల్లి, కావేరమ్మపేట్‌ అర్‌అండ్‌బీ, జడ్చర్ల, భుత్పూ ర్‌, భూరెడ్డి పల్లి, మల్లబోయిన్‌ పల్లి, దివిటిపల్లి, జానంపేట, వేముల, కందూర్‌, అడ్డాకల్‌, వెల్టూ ర్‌, మోజార్ల, కనిమెట్ట, పాలెం, రాణిపేట్‌ ఎక్స్‌రోడ్‌, బీచుపల్లి, ఎర్రవల్లి, నారయణపురం, బోరవెల్లి స్టేజి వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంది.. 

తనీఖీలు పెంచాలి

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో తనిఖీలు పెరగాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిపై బాగానే ఉన్నా రాష్ట్ర రహదారులపై తనిఖీలు తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని పోలీసు, ఆర్టీఏ అధికారులు భావిస్తూ కొంతచూసిచూడనట్లు ఉంటున్నారు. కాని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నా నేపథ్యంలో సీటు బెల్టు, హెల్మెట్‌ వంటి వాటిని తప్పనిసరి చేయాలి. దీంతో పాటు మద్యం తాగి వాహనాలు నడపుతున్నా వారికి కేసులు నమోదు చేయాలి. స్పీడ్‌ గన్‌లు ద్వారా వేగ నియంత్రణ చేసేందుకు చర్యలు తీసుకొవాలి.              


logo