శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 28, 2020 , 03:44:43

మూడు బల్దియాల్లో టీఆర్‌ఎస్‌ పాగా

మూడు బల్దియాల్లో టీఆర్‌ఎస్‌ పాగా

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల పర్వం ముగిస్తుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుండగా 3 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసింది. సోమవారం ఎన్నికైన కౌన్సిలర్‌ అభ్యర్థులచే ప్రిసైడింగ్‌ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్‌ చైర్మన్లుగా ప్రతిపాదించిన అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో అధికారులు ఏకగ్రీవంగా చైర్మన్లను ఎన్నుకోబడినట్టు ప్రకటించారు. గద్వాలలో బీఎస్‌ కేశవ్‌, అయిజలో దేవన్న, అలంపూర్‌లో మనోరమ, వడ్డేపల్లిలో కరుణలు చైర్మన్లుగా మున్సిపల్‌ పీఠాన్ని అదిష్టించారు.

బల్దియా పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ జయకేతనం ఎగుర వేసింది. 3 మున్సిపాలిటీల్లో గులా బీ జెండాను ఎగురవేసి టీఆర్‌ఎస్‌ శ్రేణులు తమ సత్తాచాటారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనని మరోసారి రుజువు చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస విజయాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు ఎదురులేదని చాటి చెప్పింది. అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్న గులాబీ జెండాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షాలకు ఉనికి కూడా లేకుండా అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపే ప్రజానీకం నిలిచింది. ఇక జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. 

ప్రమాణ స్వీకారాలు చేసిన కౌన్సిలర్లు

మున్సిపల్‌ ఎన్నికల్లో వివిధ పార్టీల తరుపున విజయం సాధించిన కౌన్సిలర్లతో ప్రిసైడింగ్‌ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. గద్వాల, అయిజ, అంలంపూర్‌, వడ్డేపల్లిలోని మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 11 గంటలకు ఎన్నికైన అం దరి కౌన్సిలర్లచే రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు లాంఛనప్రాయంగా బాధ్యతలు స్వీకరించి కౌన్సిలర్‌ హోదాలో తొలి సంతకాన్ని చేశా రు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌ అఫీషియో మెంబర్లుగా గ ద్వాల ము న్సిపాలిటీల్లో ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అయిజ మున్సిపాలిటీల్లో ఎమ్మె ల్యే డాక్టర్‌ వీఎం అబ్రహంలు హాజరయ్యారు. ప్ర మాణ స్వీకారం ముగిసిన అనంతరం చైర్మన్‌ వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. 

ఏకగ్రీవంగా చైర్మన్ల, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రిసైడింగ్‌ అధికారులు చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమాన్ని చేపట్టారు. గద్వాల, అయిజ, అలంపూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున చైర్మన్ల, వైస్‌ చైర్మన్లకు సంబంధించిన బీ-ఫాంలు ప్రిసైడింగ్‌ అధికారులకు అందించగా వడ్డేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున బీఫాంను అందించారు. ఇతర పార్టీల నుంచి బీఫారంలు అందకపోవడంతో ప్రతిపాధించిన కౌన్సిలర్లను చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా ప్రకటించారు. గద్వాలలో చైర్మన్‌గా బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌గా బాబర్‌, అయిజలో చైర్మన్‌గా దేవన్న, వైస్‌ చైర్మన్‌గా మాల నరసింహులు, అలంపూర్‌లో చైర్‌ పర్సన్‌గా సంధ్యా మనోరమా, వైస్‌ చైర్మన్‌గా శేఖర్‌ రెడ్డి, వడ్డేపల్లిలో చైర్‌పర్సన్‌గా కరుణ, వైస్‌ చైర్సన్‌గా సుజాతలు ఎన్నికయ్యారు.  


logo