శనివారం 28 మార్చి 2020
Gadwal - Jan 28, 2020 , 03:45:06

టీఆర్‌ఎస్‌ పార్టీ అభీష్టం మేరకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

టీఆర్‌ఎస్‌ పార్టీ అభీష్టం మేరకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

అయిజ : మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశా ల మేరకు అయిజ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అ భ్యర్థులను ఎన్నుకున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నే త ఉత్తనూర్‌ తిరుమల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ బీఫారాలు రాకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున 20 వార్డుల్లో పోటీ చేసి 10 మంది కౌన్సిలర్లను గెలిపించామన్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసినా సీఎం కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్‌ వెన్నంటి ఉన్నామని భరోసానిచ్చారన్నారు. అదే ధోరణిలో మంత్రి కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపినట్లు తిరుమల్‌రెడ్డి తెలిపారు. పార్టీ సిద్ధాంతాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన దేవన్నకు చైర్మన్‌గా మద్దతు ఇవ్వాలని కోరడంతో వారి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఆదివారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో 10 మంది కౌన్సిలర్లతోపాటు తాను పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికకు పది మంది కౌన్సిలర్లతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ 6 మంది కౌన్సిలర్లు కలిసి ఏకగ్రవంగా ఎన్నుకున్నట్లు తిరుమల్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ వర్గానికి చెందిన 10మంది కౌన్సిలర్లను గెలిపించిన పట్టణ ఓటర్లు, కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయిజను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాముడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, కౌన్సిలర్లు సీఎం సురేశ్‌, నర్సింహలు, శశికళ, మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, నాయకులు మల్లయ్య, వ్యాన్‌ తిమ్మయ్య, తిప్పారెడ్డి, సత్యారెడ్డి, రమేశ్‌, వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo