సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 28, 2020 , 03:37:58

వైభవంగా మార్కండేయస్వామి జయంత్యుత్సవాలు

వైభవంగా మార్కండేయస్వామి జయంత్యుత్సవాలు

గద్వాల టౌన్‌: జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మార్కండేయస్వామి జయంత్యుత్సవాలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మార్కండేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి కోట సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. ప్రధాన రహదారుల గుండా రథోత్సవం భక్తి ప్రవత్తులతో సాగింది. తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామివారిని ప్రత్యేక ఊయలలో ఉంచి మహిళలు పాటలు పాడుతూ డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 


logo